ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగానే..

24 Sep, 2014 06:50 IST|Sakshi

ఇంటర్ బోర్డుకు ఏపీ మంత్రి గంటా ఆదేశం రెండు రాష్ట్రాలకూ ఒకే ప్రశ్నపత్రం
 
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా కాకుండా ఉమ్మడిగానే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ బోర్డును ఆదేశించారు. ఉమ్మడి ప్రవేశాల అంశం ఉన్నందున ఇంటర్ పరీక్షల ప్రశ్న పత్రాలను ఏకీకృతంగానే రూపొం దించాలని చెప్పారు. విద్యాశాఖపై మంత్రి  మం గళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంటర్ చదువుకున్న విద్యార్థుల తదుపరి ఉన్నత విద్యా ప్రవేశాలను రెండు రాష్ట్రాల్లోనూ ఉమ్మడిగా జరపాల్సి ఉన్నందున ఇంటర్ పరీక్షలు కూడా ఉమ్మడి ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలని మంత్రి చెప్పారు.  

డైట్‌సెట్‌పై త్వరితగతిన చర్యలు

డైట్‌సెట్ ప్రవేశాలపై ఈ భేటీలో విస్తృత చర్చ జరిగింది. ఈ ప్రవేశాలకు ఆటంకంగా ఉన్న సాంకేతికాంశాలను పరిష్కరించాలని, డైట్‌సెట్ ఇప్పటికే ఆలస్యమైనందున త్వరితంగా ప్రవేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని గంటా సూచించారు.ఓపెన్ స్కూళ్లకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.

ఉపాధ్యాయ సంఘాలతో చర్చ..

 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాలతో కూడా మంత్రి గంటా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని జాక్టో ప్రతినిధులు, ఎమ్మెల్సీలు సమావేశానంతరం వివరించారు.
 
 

>
మరిన్ని వార్తలు