నేటినుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

12 Feb, 2014 00:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి మార్చి 4 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు జంట జిల్లాల  నుంచి సుమారు లక్షమంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. హైదరాబాద్ జిల్లాలో 194, రంగారెడ్డి జిల్లాలో 290 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.

 లక్షమందికి పైనే...
 జంట జిల్లాల నుంచి ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య లక్ష దాటింది. ైెహ దరాబాద్ జిల్లాలో 30,055 మంది జనరల్, 6,265 మంది ఒకేషనల్ పరీక్షలకు హాజరవుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి 61,473 మంది జనరల్, 5,061 మంది ఒకేషనల్ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఒకేషనల్ అభ్యర్థులకు 19 నాన్-పారామెడికల్ కోర్సులకు సంబంధించి ప్రశ్నాపత్రాలను ఇంటర్‌బోర్డు అందజేస్తుంది. పారామెడికల్ కోర్సుల విద్యార్థులకు మాత్రం ఎగ్జామినర్లే ప్రశ్నాపత్రాలను తయారు చేసి ఇస్తారు.

 అరగంట ముందే చేరుకోవాలి:  ప్రతాప్, రంగారెడ్డి జిల్లా ఆర్‌ఐవో
 ప్రాక్టికల్ పరీక్షలకు విద్యార్థులు నిర్దేశిత సమయానికంటే అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షకు వెళ్లేపుడు హాల్‌టికెట్, ప్రాక్టికల్ రికార్డ్ బుక్, కాంపాస్ బాక్స్ వెంట తీసికెళ్లాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించేది లేదు. బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తే ఆయా పరీక్షా కేంద్రాల యాజమాన్యాలు, విద్యార్థులపై ఏపీ పబ్లిక్ పరీక్షల చట్టం 1997 ప్రకారం చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు