ఎంపీ రమేష్‌ వర్సెస్ వరద

29 Jul, 2018 12:36 IST|Sakshi

తాడో పేడో తేల్చుకుంటాం 

మున్సిపల్‌ కార్యాలయానికి బయల్దేరిన వరదను అడ్డుకున్న పోలీసులు

ప్రొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్తత 

భారీగా మోహరించి వరద, ఆయన వర్గీయులను నిలువరించిన పోలీసులు

ప్రొద్దుటూరు టౌన్‌ : రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మధ్య వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. శనివారం సాయంత్రం మున్సిపల్‌ కార్యాలయంలో ఎంపీ రమేష్‌ నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాన్ని అడ్డుకుని తాడోపేడో తేల్చుకునేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డి, ఆయన వరీ ్గయులు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ నుంచి ర్యాలీగా బయల్దేరారు. మున్సిపల్‌ కార్యాలయానికి వస్తే పరిస్థితి చేయిదాటిపోతుందని పసిగట్టిన పోలీసులు జమ్మలమడుగు, మైదుకూరు డీఎస్పీలతో పాటు ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు పట్ట ణంలో పలు ప్రాంతాల్లో పోలీసులను ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకున్నారు. చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి లేకుం డా ఆయన చాంబర్‌లో కూర్చొని ఎంపీ రమేష్‌ అధికారులతో ఏవిధంగా సమీక్ష నిర్వహిస్తారని వరదరాజులరెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్యాలయానికి వెళుతుంటే పోలీసులు తమను అడ్డుకుని అక్కడ సమావేశం నిర్వహించడానికి సహకరించడంపై వరద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు. ఎంపీ రమేష్‌ పోటుగాడా అంటూ వరద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట మున్సిపల్‌ కార్యాలయంలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. 

నడిరోడ్డుపై తోపులాట
పోలీసులను తోసివేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వరదరాజులరెడ్డి, ఆయన వర్గీయులను పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించి ఆపారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డిని టూటౌ న్‌ ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది లాక్కెళ్లి త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారు. వరదరాజులరెడ్డిని రూరల్‌ సీఐ ఓబులేసు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లోకి తీసుకెళ్లినా ఆయన అక్కడ ఉండకుండా బయటికి వచ్చారు.

రోడ్డుపై ధర్నాతో స్తంభించిన ట్రాఫిక్‌
వరదరాజులరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రఘురామి రెడ్డి, ఆయన వర్గీయులు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా రోడ్డుపై కూర్చొని దాదాపు గంటన్నరకుపైగా ధర్నా చేశారు. ఎంపీ రమేష్‌తోపాటు పోలీçసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగసారాయి అమ్ముకుంటున్న రమేష్‌నాయుడు రూ.కోట్లు వెదజల్లి మున్సిపల్‌ కౌన్సిలర్లను తన వైపునకు తిప్పుకున్నారని ఆరోపించారు. ఇక అతని ఆటలు సాగనివ్వమని తేల్చి చెప్పారు. మున్సిపల్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం అనంతరం ఎంపీ రమేష్, ఆయన వర్గీయులు కార్యాలయం నుంచి వెళ్లిపోయారని తెలుసుకున్న వరదరాజులరెడ్డి, ఆయన వర్గీయులు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ర్యాలీగా మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చేందుకు బయల్దేరారు. గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు రాగానే వన్‌టౌన్‌ సీఐ వెంకటశివారెడ్డి, డీఎస్పీ, పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లనివ్వమన్నారు. నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయానికి వరదరాజులరెడ్డిని పంపించారు. ఇక్కడ అరగంటపాటు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వరద వర్గీయులకు తోపులాట జరిగింది.

ట్రాఫిక్‌ మళ్లింపు
త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద నాలుగు రోడ్లను పోలీ సులు దిగ్బంధనం చేశారు. త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మీదుగా పాత బస్టాండ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీ సులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కొర్రపాడు రోడ్డు మీదుగా వచ్చే బస్సులు వాహనాలను దారి మళ్లిం చారు. రాజీవ్‌ సర్కిల్‌లో ఆర్‌అండ్‌బీ కార్యాలయం రోడ్డును దిగ్బంధనం చేశారు. రోడ్డుకు అడ్డుగా తోపుడు బండ్లను పెట్టి ఎవరిని అనుమతించలేదు. కళాశాలలు, కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు తీవ్రఇక్కట్లు ఎదుర్కొన్నారు.

మరిన్ని వార్తలు