30, 31 తేదీల్లో ఐఏఎస్ పోస్టులకు ఇంటర్వ్యూలు

29 Dec, 2013 00:31 IST|Sakshi

ఆరు ఐఏఎస్ పోస్టులకు 30 మంది పోటీ
యూపీఎస్సీ చైర్మన్ అగర్వాల్ రాక



 సాక్షి, హైదరాబాద్: రెవెన్యూయేతర సర్వీసు నుంచి ఆరు ఐఏఎస్ పోస్టుల భర్తీకోసం ఈనెల 30, 31వ తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ డి.పి. అగర్వాల్ హైదరాబాద్ రానున్నారు. ఇంటర్వ్యూ కమిటీలో అగర్వాల్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి, సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభాకర్ థామస్, బి.ఆర్. మీనా, సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి శివశంకర్ ఉంటారు. ఆరు ఐఏఎస్ పోస్టుల భర్తీకోసం రాష్ట్ర ప్రభుత్వం 30 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. కాగా, ఈ జాబితాలో తమ పేర్లు లేవని కొంత మంది అధికారులు క్యాట్‌ను ఆశ్రయించగా వారికి కూడా అవకాశం కల్పించాలని క్యాట్, యుూపీఎస్సీని ఆదేశించింది. అయితే దీనిపై హైకోర్టులో కేసు దాఖలు కాగా మరో ఆరుగురికి అవకాశం కల్పించాలన్న క్యాట్ ఆదేశాలను తోసిపుచ్చింది.

ఇంటర్వ్యూకు హాజరయ్యే వారి జాబితాలో పి.కరుణాకర్, ఎల్. వందన్‌కుమార్, సి. శ్రీధర్, ఆర్. వేణుగోపాలరావు, జి. మల్సూర్, పి. కోటేశ్వరరావు, ఎ.ఇంతియాజ్, ఎన్. యోగేశ్వర శాస్త్రి, కె. శ్రీనివాసరావు, ఎస్. అరవిందర్ సింగ్, బి. శరత్‌చంద్రారెడ్డి, ఎస్. దేవేందర్‌రెడ్డి, జి. లక్ష్మీబాయి, ఎం. సుధాకర్‌రావు, వి. శ్రీనివాసులు, జి. సుబ్బారాయుడు, ఎం. సురేందర్, బి. రేవతి రోహిణి, ఇస్రార్ అహ్మద్, వి. చిన వీరభద్రుడు, జె. లక్ష్మీనారాయణ, కె. రవిశంకర్, ఎం. ప్రశాంతి, ఎ. రవీంధ్రనాథ్, ఎస్. కృష్ణమూర్తి, ఎం. వెంకట రాజేశ్, ఎన్. సత్యనారాయణ, ఆర్. మల్లికార్జునరావు, ఆర్.వి. ప్రసాదరాజు, కె. అశోక్‌రెడ్డిలు ఉన్నారు. ఇందులో సురేందర్ ముఖ్యమంత్రి పేషీలో, కె.శ్రీనివాసరావు రెవెన్యూమంత్రి పేషీలో పనిచేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు