సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో ఆహ్వానం

4 Apr, 2017 11:55 IST|Sakshi
అమరావతి: ఈ నెల 10వ తేదీన వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టీటీడీ ఈవో సాంబశివరావు ఆహ్వానించారు.
 
మంగళవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళిన ఈవో  సీఎంను కలిసి ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరారు. శ్రీరామనవమి బ్రహోత్సవాలలో భాగంగా రాష్ట్రంలో పురాతన ప్రసిద్ధ రామ మందిరమైన ఒంటిమిట్ట దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణానికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు ఈవో తెలిపారు.
 
మరిన్ని వార్తలు