24 గంటల్లో నిందితులను పట్టుకుంటాం: ఎస్పీ

29 Apr, 2015 15:12 IST|Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన వైఎస్ఆర్సీపీ నేత ప్రసాద్రెడ్డి హత్యకేసులో నిందితులను 24 గంటల్లో పట్టుకుంటామని ఆ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. ప్రసాద్ రెడ్డి హత్యకేసుపై విచారణ చేపట్టామని ఆయన చెప్పారు. రాప్తాడు తాహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలు ప్రసాద్ రెడ్డిని వేట కొడవళ్లతో దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. 
 

అయితే ఈ హత్య రాజకీయ హత్యా ?, ఫ్యాక్షన్ హత్యా? అని విచారిస్తున్నామని ఎస్పీ అన్నారు. ఇప్పటికే కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.  పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాత్రపై విచారిస్తామన్నారు. ప్రసన్నాయనపల్లెలో చాలారోజులుగా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయని ఎస్పీ రాజశేఖర బాబు పేర్కొన్నారు.

అలాగే డీఐజీ బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రసాద్రెడ్డిది రాజకీయ హత్య కాదు, ముఠాకక్షలే హత్యకు కారణమని చెప్పారు. 2003లో జరిగిన ట్రిపుల్ మర్డర్కు ప్రతీకారంగానే హత్య జరిగినట్టు భావిస్తున్నామని తెలిపారు. ప్రసాద్రెడ్డి హత్యానంతరం జరిగిన విధ్వంసంపై కేసు నమోదు చేస్తామని డీఐజీ బాలకృష్ణ చెప్పారు.

మరిన్ని వార్తలు