పరిశ్రమల రీస్టార్ట్‌కు ఎన్‌వోసీ తప్పనిసరి

25 Apr, 2020 04:26 IST|Sakshi

పారిశ్రామిక ప్రతినిధులు, అధికారుల సమీక్షలో మంత్రి మేకపాటి

సాక్షి, అమరావతి/నెల్లూరు (సెంట్రల్‌): లాక్‌డౌన్‌ సమయంలో గ్రీన్‌జోన్‌లో ఉన్న పరిశ్రమలు రీస్టార్ట్‌ పథకం కింద తిరిగి ప్రారంభించడానికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ) ఉండాల్సిందేనని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక సంఘాలు, పారిశ్రామిక శాఖ అధికారులతో ‘రీస్టార్ట్‌’ నిబంధనల అమలుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.  

► పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆగిపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి రీస్టార్ట్‌ కింద గ్రీన్‌జోన్‌లో ఉన్న పరిశ్రమలను నెమ్మదిగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.  
► గురువారం నాటికి 812 కంపెనీలు ఎన్‌వోసీకి దరఖాస్తు చేసుకోగా అందులో ఇప్పటి వరకు  138 సంస్థలకు అనుమతి ఇచ్చామని, 585 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు వివరించారు.  
► పరిశ్రమలు తిరిగి ప్రారంభించడంలో ఎదురవుతున్న సమస్యలపై ఫిక్కీ, సీఐఐ, ఎఫ్‌ఏపీఎస్‌ఐఏ, ఎలీప్, ఫెర్రో అల్లాయీస్, స్పిన్నింగ్‌ మిల్స్‌ అసోసియేషన్స్‌ ప్రతినిధులను మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు