‘ఉపాధి’ నిధులు మింగేశారు

12 Oct, 2019 08:53 IST|Sakshi
సామాజిక తనిఖీ బహిరంగ సభలో వివరాలు వెల్లడిస్తున్న అధికారులు

సాక్షి, శాంతిపురం(చిత్తూరు) : సామాజిక తనిఖీ సాక్షిగా అక్రమాల పుట్టలు పగిలాయి. టీడీపీ పాలనలో 2018–19 ఆర్థిక సంవత్సరం మండలంలో రూ. 11.13 కోట్లతో జరిగిన పనులపై నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌లో రూ.70,16,313 రికవరీకి అధికారులు ఆదేశించారు. 15 మంది అధికారులను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మండలంలో గత ఆర్థిక సంవత్సరం జరిగిన ఉపాధి హామీ పనులపై ఈనెల 30 నుంచి అధికారులు తనిఖీలు నిర్వహించారు. పంచాయతీల వారీగా పనులను పరిశీలించి, నివేదికలను సిద్ధం చేశారు. డ్వామా ఏపీడీ కిరణ్‌కుమార్‌ ప్రొసీడింగ్‌ అధికారిగా, జిల్లా ఉపాధి హామీ విజిలెన్స్‌ అధికారి శివయ్య సమక్షంలో గురువారం ఉదయం ప్రారంభమైన బహిరంగ వేదిక అర్ధరాత్రి వరకూ కొనసాగింది. మండలంలోని 23 పంచాయతీల్లో ఉపాధి హామీ శాఖ ద్వారా జరిగిన పనుల్లో గరిష్టంగా రూ.55,31,847, వెలుగు ద్వారా చేసిన పనుల్లో 3,97,456, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా చేసిన వాటిలో 8,39,180, పశుసంవర్ధక శాఖ నుంచి రూ.5,000, హౌసింగ్‌ శాఖ నుంచి రూ.30,830 బాధ్యుల నుంచి రికవరీకి ఆదేశించారు. పొరబాట్లు చేసిన ఉపాధి సిబ్బందికి జరిమానాగా మరో రూ.2,17,000 విధించారు. గతంలో జరిగిన 12 విడతల సామాజిక తనిఖీల్లో ఎన్నడూ రూ.10 లక్షలకు మించి రికవరీ రాకపోగా ఇప్పుడు ఏకంగా రూ.70.16 లక్షల ఆక్రమాలను గుర్తించి ఆ మేరకు రికవరికీ ఆదేశించటం స్థానికంగా సంచలనమైంది.

పంచాయతీల వారీగా రికవరీ
13వ విడత సామాజిక తనిఖీల్లో రూ.12,35, 038 రికవరీతో ఎంకేపురం పంచాయతీ అక్రమాల్లో అగ్రస్థానంలో నిలిచింది. కోనేరుకుప్పంలో నామమాత్రంగా రూ.18,305 మాత్రమే అక్రమాలను గుర్తించారు. దండికుప్పం పంచాయతీలో రూ.11,94,599, అనికెరలో రూ. 1,53,001, మొరసనపల్లిలో రూ.1,45,712, శివరామ పురంలో రూ.2,93, 992, కడపల్లిలో రూ. 1,13,941, సి.బండపల్లిలో రూ. 5,71,663, రేగడదిన్నేపల్లిలో రూ.5,85,748, సొన్నేగానిపల్లిలో రూ.8,77,796, కెనమాకులపల్లిలో రూ.42,128, నడింపల్లిలో రూ. 4,20,583, అబకలదొడ్డిలో రూ.1,17,809, చెంగుబళ్లలో రూ.72,998, మఠంలో రూ.1,25,841, చిన్నారిదొడ్డిలో రూ.1,72,635, 121పెద్దూరులో రూ. 38,346, తుమ్మిశిలో రూ.2,21,524, 64పెద్దూరులో రూ.32,553, కర్లగట్టలో రూ.2,13,948, కొలమడుగులో రూ.1,45, 506, గుంజార్లపల్లిలో రూ.41,581, రాళ్లబూదుగూరు పంచాయతీలో రూ.1,18,952 రికవరీకి డ్వామా పీడీ ఆదేశిం చారు. వారం రోజుల్లోపు రికవరీ కాని వాటిపై రెవెన్యూ రికవరీ యాక్టు కింద చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించారు.

15మంది అధికారులపై చర్యలు
మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల అక్రమాలకు బాధ్యులుగా గుర్తించి మొత్తం 15 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. పంచాయతీరాజ్‌ రిటైర్డ్‌ ఇంజినీర్‌ గోపాల్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ఆర్థిక లాభాలను నిలుపుదల చేశారు. టెక్నికల్‌ అసిస్టెంట్లు ధర్మలింగం, వెంకటేష్, సి.బండపల్లి సీనియర్‌ మేట్‌ గోవిందరాజును పూర్తిగా విధుల నుంచి తప్పించారు. అప్పటి ఏపీఓ హరినాథ్, టీఏలు రఘునాథ్, మునిరత్నంను సస్పెండ్‌ చేశారు. వీరితో పాటు ఫీల్డు అసిస్టెంట్లుగా ఉన్న పౌలారాణి(శివరామపురం), నాగరాజు(చిన్నారిదొడ్డి), శివానందం(రేగడదిన్నేపల్లి), సుబ్రమణ్యం(దండికుప్పం), మంజు నాథ్‌(ఎంకే పురం), వెంకటేశు(నడింపల్లి), సుబ్రమణ్యం(అబకలదొడ్డి), నాగరాజు(తుమ్మిశి)ను సస్పెండ్‌ చేశారు. గురువారం ఉదయం ప్రారంభమైన బహిరంగ వేదిక అర్ధరాత్రి వరకూ కొనసాగింది. 23 పంచా యతీల్లో ఉపాధి హామీ ద్వారా జరిగిన పనుల్లో గరిష్టంగా రూ.55,31,847, వెలుగు ద్వారా చేసిన పనుల్లో 3,97,456, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా చేసిన వాటిలో 8,39,180, పశుసంవర్ధక శాఖ నుంచి రూ.5వేలు, హౌసింగ్‌ నుంచి రూ.30,830 బాధ్యుల నుంచి రికవరీకి ఆదేశించారు. పొరబాట్లు చేసిన ఉపాధి సిబ్బందికి జరిమానాగా రూ. 2,17,000 విధించారు. గతంలో జరిగిన 12 విడతల సామాజిక తనిఖీల్లో ఎన్నడూ రూ.10 లక్షలకు మించి రికవరీ రాలేదు. ఇప్పుడు రూ.70.16 లక్షలు రావడం స్థానికంగా సంచలనమైంది.

మరిన్ని వార్తలు