ఇరిగేషన్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్

30 Jul, 2013 04:32 IST|Sakshi
సాక్షి, తిరుపతి:  కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు అయిన పీలేరు సర్పంచ్ అభ్యర్థి ఏఎస్ హుమయూన్‌ను కబ్జా ఆరోపణలు వెంటాడుతున్నాయి. పదవి రాకముందే కాంగ్రెస్ మద్దతుదారుడు ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకున్నారని ప్రత్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రూ.కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న విషయం అధికారులకు తెలిసినా అధికార పార్టీకి భయపడి నోరెత్తలేదని విమర్శిస్తున్నారు. స్థానికు ల కథనం మేరకు సీఎం కిరణ్ సొంత నియోజకవర్గమైన పీలేరు పట్టణం నడిబొడ్డులో సర్వేనంబర్-249లో రూ. కోట్ల విలువచేసే ఇరిగేషన్ స్థలం ఉంది. టీడీపీ హయాంలోనే ఈ స్థలంలో కొందరు అక్రమార్కులు కబ్జాచేసి భవనాలు కట్టుకున్నారు. అయితే వాటిని అప్పటి అధికారులు పడగొట్టి స్వాధీనం చేసుకున్నారు.
 
అప్పటి నుంచి ఆ ఇరిగేషన్ స్థలంలో ఎటువంటి నిర్మాణాలూ లేవు. ఆ స్థలంపై అధికార కాంగ్రెస్ నాయకుల కన్నుపడిందని, అనుకున్నదే తడవుగా కాంగ్రెస్ మద్దతుదారుడు కొం దరు అధికారులను మచ్చిక చేసుకున్న ట్లు చెబుతున్నారు. సినిమా హాలు పక్క నే ఉన్న అయ్యపునాయుని చెరువు సపైై్ల్లచానల్ స్థలంలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారని పీలేరులో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కాం గ్రెస్ నేతలకు భయపడి ఈ విషయాన్ని అధికారులు చెప్పడం లేదన్న ఆరోపణలున్నాయి. రెవెన్యూ అధికారులు మాత్రం తాము ఆరు నెలల క్రితమే సర్వేచేసి ఇరిగేషన్ వారికి అప్పగించామని చేతులెత్తేశారు. ఇటీవల జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సమావేశంలో అధికారులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై మండిపడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  
 
>
మరిన్ని వార్తలు