బాబూ మాట నిలుపుకోవాలి

27 Jan, 2015 02:44 IST|Sakshi
బాబూ మాట నిలుపుకోవాలి

ఉరవకొండ :  ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చి మాట నిలుపుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయ్యూక ఇచ్చిన హామీలు మరచి మాటలు కోటలు దాటేలా వ్యవహరిస్తుండటం దారుణం అన్నారు. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి 31న పశ్చివు గోదావరి జిల్లా తణుకులో చేపట్టే 48 గంటల దీక్షతో పాటు ఉరవకొండలో తన సోదరుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హంద్రీ-నీవా కాలువ నిధుల సాధన కోసం చేపట్టనున్న దీక్షకు మద్దతు తెలుపుతూ ఉరవకొండ నుండి సోవువారం ఆయన ప్రారంభించిన పాదయూత్రకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.

హంద్రీ-నీవా పథకానికి వైఎస్‌రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన శిలా ఫలకం నుండి ఆయన పాదయూత్ర ప్రారంభించారు. అంతకు ముందు ఆయన వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వూట్లాడుతూ చంద్రబాబు అవులుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అటకెక్కిస్తున్నారని మండిపడ్డారు. గడిచిన ఎనిమిది నెలల కాలంలో ప్రజల విశ్వాసాన్ని చూరగోనే ఒక్క పని చేయులేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న రుణమాఫీకి కూడా ఎన్నో అడ్డంకులు కల్పిస్తూ మోకాలడ్డుతున్నారన్నారు.

కరవు జిల్లా అనంతపురాన్ని చంద్రబాబు పూర్తిగా విస్మరించి మాటలతో కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి హంద్రీ-నీవా తొలి దశలో మిగిలిన అన్ని పనులను యుుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయూలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేయూలన్నారు. జగన్, విశ్వేశ్వరరెడ్డి దీక్షలను ప్రజలు విజయవంతం చేయూలని పిలుపునిచ్చారు. పాదయూత్ర లత్తవరం, షేక్షానుపల్లి, కోనాపురం, పెన్నహోబిళం మీదుగా కూడేరు మండలంలోకి ప్రవేశించింది.

పాదయూత్రకు ఆయూ గ్రావూల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వుహిళలు హారతులు పట్టారు. పాదయూత్రలో ఉరవకొండ, విడపనకల్లు జడ్‌పీటీసీ సభ్యులు లలితవ్ము, తిప్పయ్యు, పార్టీ జిల్లా వుహిళా విభాగం అధ్యక్షురాలు బోయు సుశీలవ్ము, జిల్లా స్టీరింగ్ కమీటి సభ్యులు తేజోనాధ్, అశోక్, వుండల, పట్టణ కన్వీనర్లు సుంకన్న, బసవరాజు, వజ్రకరూర్ ఎంపీపీ కొర్ర వెంకటవ్ము, వూజీ ఎంపీపీ ఎసీ ఎర్రిస్వామి, వుండల నాయుకులు వన్నప్ప, తులసీదాస్, ప్రతాప్, నవీన్‌రెడ్డి, వడ్డే ఆంజినేయుులు, లత్తవరం గోవిందు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు