యువతకు స్ఫూర్తి ప్రదాత చెవిరెడ్డి

5 Mar, 2015 01:59 IST|Sakshi
యువతకు స్ఫూర్తి ప్రదాత చెవిరెడ్డి

పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ప్రశంసల జల్లు
తిరుపతి రూరల్‌లో వైఎస్సార్ ప్రతిభా పురస్కారాల ప్రదానం

 
తిరుపతి రూరల్: నిరంతరం ప్రజా అభ్యుదయ, సంక్షేమ కార్యక్రమాలతో రాజకీయాల్లో చురుకైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి  నేటి యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ ప్రశంసించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సొంత నిధులతో ప్రారంభించిన వైఎస్సార్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం తి రుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి హైస్కూల్‌లో జరిగింది. ఈకార్యక్రమాని కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సునీ ల్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఉన్నతి సాధ్యమన్నారు. విద్యను ప్రోత్సహించిన వారు చరిత్రలో మహనీయులు గా కీర్తించబడతారని, ఆకోవలోకే ఎమ్మె ల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిలుస్తున్నారని చెప్పారు.

పేదలు, మధ్యతరగతి విద్యార్థులు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పెం చేందుకు, విద్యార్థులను ప్రోత్సహించేం దుకు వైఎస్సార్ ప్రతిభా పురస్కారాలను అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ టీచర్ల పిల్లలు కూడా ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారని, ఇది మం చి పరిణామం కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఈ ప్రమాణాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆదిశగా ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. నైపుణ్యాలు, విద్యాజ్ఞానం అధికంగా చిన్నారుల్లో ఉంటాయనీ, వాటిని వెలికి తీసేం దుకు ప్రోత్సాహం అవసరముందన్నా రు. అందుకే వైఎస్‌ఆర్ పేరిట ప్రతిభా పురస్కారాలను విద్యార్థులకు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలి పారు. అంతకుముందు సర్పంచ్ భారతీరవి, ఎంపీటీసీ సుభాషిణిమోహన్‌లు ఎమ్మెల్యేలు సునీల్‌కుమార్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. దశాబ్దాల పాటు విద్యా బోధనల్లో విశేష సేవలందించిన విశ్రాంత టీచర్లను ఎమ్మె ల్యే చెవిరెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్‌నాయు డు, ఎంఈవో ప్రసాద్, ఆర్‌ఐ శంకర య్య, వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, మునీశ్వరరెడ్డి, చిన్నియాదవ్, శ్రీరాములు, వీరనారాయణరెడ్డి, రవి, సింగిల్‌విండో డెరైక్టర్ జయచంద్రారెడ్డి, హెచ్‌ఎం శ్రీనివాసులు, భాను తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు