రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఐఎస్‌బీ సహకారం

25 Jun, 2020 03:54 IST|Sakshi

ముగ్గురు ప్రొఫెసర్లతో అడ్వైజరీ కౌన్సిల్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ ఐఎస్‌బీలో మంత్రి మేకపాటి

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 తర్వాత రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ముందుకొచ్చింది. ఇందుకోసం ముగ్గురు ప్రొఫెసర్లతో అడ్వైజరీ కౌన్సిల్‌ను ఐఎస్‌బీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. వీరితోపాటు వివిధ రంగాల నిపుణులు, మేధావులకు కూడా అడ్వైజరీ కమిటీలో భాగస్వామ్యం కల్పించనున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రస్తుత వ్యవస్థను పూర్తిగా సంస్కరించే విధంగా ఐఎస్‌బీని నోడల్‌ ఏజెన్సీగా రాష్ట్ర పరిశ్రమల శాఖ నియమించుకుంది. ఐఎస్‌బీ క్యాంపస్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన ‘ఐఎస్‌బీ భాగస్వామ్య సదస్సు’ రెండో సమావేశంలో మంత్రి  మేకపాటి మాట్లాడుతూ.. ఐఎస్‌బీ సేవలను ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు విభాగాల్లో వినియోగించుకోనున్నామని,15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామని చెప్పారు.  సమావేశంలో ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ భగవాన్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు