ముక్కంటి సేవలో ఇస్రో చైర్మన్

15 Oct, 2014 04:28 IST|Sakshi
ముక్కంటి సేవలో ఇస్రో చైర్మన్

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి మంగళవారం రాత్రి ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ విచ్చేశారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి,అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వచనం పొందారు. అధికారులు దుశ్శాలువాతో సత్కరించి, స్వామి, అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.
 
తిరుమలలో..

తిరుమల :  శ్రీవారి దర్శనార్థం మంగళవారం తిరుమలకు వచ్చిన ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్‌కు సాదర స్వాగతం లభించింది. సాయంత్రం 5 గంటలకు ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా ఇటీవల మార్స్ మిషన్ (మామ్) ప్రయోగం విజయవంతం కావడంతో జేఈవో శ్రీనివాసరాజు ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే శ్రీవారి ఆలయం ముందు, వెలుపల చేసిన మార్పులు చేర్పులపై ఇస్రో చైర్మన్‌కు జేఈవో శ్రీనివాసరాజు వివరించి చెప్పారు. స్వామి దర్శనం తరువాత తిరుగు ప్రయాణమైన రాధాకృష్ణన్‌కు వీడ్కోలు పలికారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు