సమస్యలపై 'జన్మభూమి'లో నిలదీయండి

2 Oct, 2014 01:51 IST|Sakshi
సమస్యలపై 'జన్మభూమి'లో నిలదీయండి

అనంతపురం అర్బన్:  జిల్లాలో 4 నియోజకవర్గాల్లో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో సమస్యలపై టీడీపీ ప్రజాప్రతినిధులను, నాయకులను నిలదీయాలని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు  పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడారు. గురువారం నుంచి అధికార పార్టీ చేపడుతున్న జన్మభూమి కార్యాక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు ఫైళ్లపై సీఎం తొలిసంతకం చేశారని వారు గుర్తుచేశారు. కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చేందుకు సంవత్సర కాలం పడుతుందని, టీడీపీ ప్రభుత్వం వంద రోజులకే వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు.  ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా బేషరతుగా రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులను పూర్తిగా రుణ విముక్తుల గావించని తర్వాతే ప్రభుత్వం రైతుల కోసం పెట్టిన ‘రైతు సాధికారిత సంఘం’కు సార్థకత లభిస్తుందన్నారు. ఒక్కో మండలంలో వెయ్యి మంది చొప్పున  అర్హులైనవారిని పింఛను పథకం నుంచి తొలగించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

అర్హులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.  జాబితా నుంచి తొలిగించిన పింఛన్ లబ్ధిదారులు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకులను నిలదీయాలన్నారు. బాధితులకు కాంగ్రెస్ నాయకులు ఉంటారన్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులను  తొలిగిస్తే ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. ఇందుకు ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఛిౌజట్ఛటట ఛిౌఝఝజ్ట్ట్ఛ్ఛీ.్చఞఃజఝ్చజీ.ఛిౌఝ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.



 

మరిన్ని వార్తలు