కలర్స్‌ హెల్త్‌ కేర్‌ సంస్థల్లో ఐటీ దాడులు

31 Oct, 2019 08:10 IST|Sakshi

చిత్తూరు ,తిరుపతి రూరల్‌: హైదరాబాద్‌లోని కలర్స్‌ హెల్త్‌ కేర్‌ సంస్థకు చెందిన దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌ల్లో ఆదాయపు పన్ను శాఖాధికారులు బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తిరుపతిలోని రెండు బ్రాంచ్‌లతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 49 బ్రాంచ్‌ల్లో ఈ దాడులు రాత్రి వరకు కొనసాగాయి. తిరుపతి కేటీరోడ్డు, ఎంఆర్‌పల్లి సర్కిల్‌లోని బ్రాంచ్‌ల్లో హైదరాబాద్, చెన్నై నుంచి వచ్చిన రెండు బృందాలు సోదాలు చేశాయి. పలు కీలక పత్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. బరువు తగ్గించడం, బ్యూటీషియన్‌ వంటి రంగాల్లో కలర్స్‌ హెల్త్‌ కేర్‌ సంస్థ వ్యాపారాలు చేస్తోంది. కాగా ఆ సంస్థ ఆదాయపు పన్ను శాఖకు పన్నులు సక్రమంగా చెల్లించడం లేదని గుర్తించారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో దేశవ్యాప్తంగా బుధవారం దాడులు చేశారు. తిరుపతిలోని రెండు బ్రాంచ్‌ల్లో కూడా దాడులు జరిగాయి. దాడులకు సంబంధించి ఐటీ అధికారులు కానీ, కలర్స్‌ సంస్థ ప్రతినిధులు కానీ వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు. ఐటీ అధికారులు ఈ దాడుల విషయాన్ని గోప్యంగా ఉంచడంపై తిరుపతిలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా నిలిచింది.

మరిన్ని వార్తలు