బ్లూ ఫ్రాగ్‌ దాగుడు‘మూత’లు

6 Mar, 2019 08:13 IST|Sakshi
మంగళవారం రాత్రి తెరుచుకున్న బ్లూ ఫ్రాగ్‌ కార్యాలయం 

అర్ధంతరంగా కార్యాలయం మూత

మంగళవారమంతా కాపుకాచిన మీడియా ప్రతినిధులు.. తెరుచుకోని షట్టర్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమా చారాన్ని లీక్‌ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖలోని బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీ సంస్థ దాగుడు‘మూత’లు ఆడుతోంది. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు సెల్‌ఫోన్‌ ఆధారిత సేవల పేరిట వైజాగ్‌లోని బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌ సంస్థ రాష్ట్ర జనాభా వివరాలు, భౌగోళిక ప్రాంతాలు, ప్రజల ఆధార్‌ కార్డుల వివరాలు, ఏపీ స్మార్ట్‌ పల్స్‌ సర్వే, స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌తోపాటు హైదరాబాద్‌లోని కావ్య డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ నుంచి ప్రజా సాధికార వేదిక వివరాలను సేకరిస్తోంది. ఈ డేటా మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఐటీ గ్రిడ్స్‌ ఇండియా సంస్థకు అందిస్తోందని డాటా ఎనలిస్ట్‌ అయిన లోకేశ్వరరెడ్డి మూడురోజులక్రితం తెలంగాణలోని మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (సర్వం దోచేశారు)

అప్పట్నుంచీ విశాఖ నగరం సిరిపురం జంక్షన్‌లోని బ్లూ ఫ్రాగ్‌ కార్యాలయాన్ని అర్ధంతరంగా మూసివేశారు. సమాచార సేకరణకోసం మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మీడియా ప్రతినిధులు కాపు కాసినా.. కార్యాలయం షట్టర్‌ తెరవలేదు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత మీడియా ప్రతినిధులు వెళ్లిపోయారని భావించి ఉద్యోగులు కొందరు కార్యాలయాన్ని ఓపెన్‌ చేశారు. దీంతో సాక్షి ప్రతినిధులు వెళ్లి.. ప్రస్తుతం ఉభయరాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిన డేటాచోరీలో బ్లూ ఫ్రాగ్‌ పాత్ర ఏమిటని ప్రశ్నించగా... వారు చాలా దురుసుగా సమాధానమిచ్చారు. తొలుత అసలు ఇది బ్లూ ఫ్రాగ్‌ కాదని, మ్యాంగో బాక్స్‌ పేరిట వీడియో గేమ్స్‌ యాప్‌లు తయారుచేసే కంపెనీ అంటూ వాదించారు. అయితే బ్లూ ఫ్రాగ్‌ బోర్డే ఉంది కదా ప్రశ్నిస్తే... మాకేమీ తెలియదన్నారు. సంస్థ ఎండీ ఫణిరాజ్‌ ఎక్కడున్నారని అడిగితే... అస్సలు మేమేమీ చెప్పం అంటూ తిరిగి డోర్‌ లాక్‌ చేసేశారు. (ఎన్నికల అక్రమాలకే డేటా చౌర్యం)

మరిన్ని వార్తలు