దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతారా?

5 Oct, 2019 14:46 IST|Sakshi

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అరాచకం సృష్టిస్తున్నారు

ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు

ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

సాక్షి, తాడేపల్లి: దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని, టీడీపీ నేతల అరాచకాలను వెలికితీస్తే టీడీపీ నేతలు అందరూ జైల్లో ఉండాల్సి వస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటనపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, వెంకటేశ్వరస్వామిని టీడీపీ నేతలు వెంకన్న చౌదరిగా అభివర్ణించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. దుర్గమ్మ గుడిలో క్షుద్రపూజలు మీరు చేయలేదా? అని చంద్రబాబుని ప్రశ్నించారు. దుర్గమ్మ కిరీటం చంద్రబాబు హయాంలోనే మాయమైందని, సదవర్తి భూముల విషయంలో కోర్టు తీర్పును మర్చిపోయారా? అని గుర్తు చేశారు. విలువలకు విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్‌ అని, ఆయన పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. పాలనలో ఏమైనా తప్పులు ఉంటే చంద్రబాబు సలహాలు, సూచనలు ఇస్తే సరిదిద్దుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన గంట నుంచే ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ పోతుంటే చంద్రబాబు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆయన మండిపడ్డారు.

ఇచ్చిన మాట ప్రకారం ఆటో డ్రైవర్‌లకు పది వేలు..
రివర్స్ టెండరింగ్‌ను వ్యతిరేకిస్తూ అవినీతిపరులకు చంద్రబాబు కొమ్ము కాస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తుంటే.. తన నివాసాన్ని కులగోడుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆటో డ్రైవర్‌లకు ఇస్తున్న పది వేల రూపాయలపైన చంద్రబాబు రాజకీయాలు చేయండ సరికాదన్నారు. సీఎం జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం, ఆయన ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలలు లోపునే.. సొంత ఆటో ఉన్న డ్రైవర్‌కు పది వేలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఉద్దేశ్యంలో కేశినేని నాని, జేసీ దివాకర్‌ రెడ్డి లాంటి వాళ్లకు పది వేలు ఇవ్వాలని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

రైతు పక్షపాతి సీఎం జగన్..
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి అని, రైతు భరోసా కింద రూ. 12,500 ఇస్తున్నారని, ధరల స్థిరీకరణ నిధి ప్రవేశ పెట్టారని అన్నారు. మద్య నియంత్రణ, ఇంటికొక ఉద్యోగం, రైతు రుణమాఫీ పేరిట చంద్రబాబు ప్రజలను మోసం చేశారని తెలిపారు. 

మరిన్ని వార్తలు