ఏపీ ఎన్జీవోల భూమిని తీసుకోవడం అన్యాయం: అశోక్ బాబు

4 Jul, 2014 18:12 IST|Sakshi
ఏపీ ఎన్జీవోల భూమిని తీసుకోవడం అన్యాయం: అశోక్ బాబు
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అన్యాయమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఆంధ్ర ప్రాంత వారిపై కక్షసాధింపు చర్యగా ఉద్యోగులు భావిస్తున్నారని అశోక్ బాబు మీడియాకు తెలిపారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయలేదనడం భావ్యం కాదన్నారు. 
 
2010లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్లే తాము నిర్మాణాలు చేపట్టలేకపోయామని అశోక్‌బాబు వివరణ ఇచ్చారు.  4 కోట్ల రూపాయలు లే అవుట్ ఛార్జీల కోసం, భూమి అభివృద్ధికి 5 కోట్లు ఖర్చుచేశామని అశోక్‌బాబు తెలిపారు. ఎపీఎన్జీవోలతోపాటు ఇతర సంఘాలకు ఇచ్చిన భూముల్లో కూడా చాలాభాగం నిర్మాణాలు జరగలేదని మీడియాకు అశోక్‌బాబు వెల్లడించారు. 
 
ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూములే వెనక్కి తీసుకోవడం భావ్యం కాదని,  సీఎం కేసీఆర్‌ను కలిసి వాస్తవాలు తెలియజేస్తామని అశోక్ బాబు అన్నారు. 
మరిన్ని వార్తలు