జగన్‌ను సీఎం చేయడమే వైఎస్‌కు నిజమైన నివాళి : రోజా

3 Dec, 2018 12:00 IST|Sakshi
వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న రోజా, గోపిరెడ్డి

అరాచకాలకు పాల్పడుతున్న స్పీకర్‌ కోడెలను ఓడించాలి 

రెడ్ల కార్తీక వనసమారాధనలో రోజా పిలుపు 

సాక్షి, నరసరావుపేట రూరల్‌: జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే వై.ఎస్‌. రాజశేఖరరెడ్డికి ఆయన అభిమానులు ఇచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజా అన్నారు. కోటప్పకొండలోని యోగి వేమన చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రెడ్ల సత్రంలో నిర్వహించిన కార్తీక వనసమారాధన, గురవాయపాలెంలో వై.ఎస్‌. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

గ్రామాల్లో చిన్నచిన్న విబేధాలను పక్కనపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలపుకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా తెలుగుదేశం పార్టీ కోనుగులు చేసిందని, వారిపై స్పీకర్‌ కోడెల ఎందుకు చర్యలు  తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అరాచకాలకు పాల్పడుతున్న ఆయన్ను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. గురజాల సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుడూ టీడీపీ దోపిడి పాలన అంతమొందించేందుకు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, యెగి వేమారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ గౌరవ అధ్యక్షుడు  భవనం రాఘవరెడ్డి, అధ్యక్షుడు గాయం కృష్ణారెడ్డి, కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, మోదుగుల పాపిరెడ్డి,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పిల్లి ఓబుల్‌రెడ్డి, కాపులపల్లి ఆదిరెడ్డి, కాకుమాను సదాశివరెడ్డి, డాక్టర్‌ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ ఎన్‌. యజ్ణనారాయణరెడ్డి, మాగులూరి రమణారెడ్డి, గానుగపంట ఉత్తమరెడ్డి, మూరే రవీంద్రారెడ్డి, సి.వి. రెడ్డి, మద్దిరెడ్డి నర్సింహరెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన వన భోజనాల్లో 18వేల మంది పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా