మాటిచ్చామంటే.. నెరవేర్చాల్సిందే

5 Jul, 2019 04:29 IST|Sakshi

మనకు ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు మాటిచ్చాక నిలబెట్టుకోవాల్సిందే

రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో ఆర్థికశాఖకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

ప్రజల ఆశలకు అనుగుణంగా బడ్జెట్‌

నవరత్నాలకు ప్రాధాన్యం.. పింఛన్లు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి తగిన కేటాయింపులుండాలి

వైఎస్సార్‌ రైతు భరోసా, రైతుల పంటల బీమా ప్రీమియంకు నిధుల కొరత రాకూడదు

గత సర్కారు విచ్చలవిడి ఖర్చుతో దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదించిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే వాటిని అధిగమించి ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల పథకాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల 12వతేదీన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్‌ ఎలా ఉండాలి? ఏ రంగాలకు ప్రాధాన్యం కల్పించాలి? కేటాయింపులు ఎలా ఉండాలనే అంశాలపై ముఖ్యమంత్రి గురువారం ఆర్థికశాఖకు దిశా నిర్దేశం చేశారు.

బడ్జెట్‌ రూపకల్పనపై ముఖ్యమంత్రి ప్రాథమికంగా నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితికి దిగజార్చిందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు ఐదు నెలల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు.  

ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేని విధంగా దిగజారిందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొనటంతో ముఖ్యమంత్రి జగన్‌ స్పందిస్తూ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తీరాల్సిందేనని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలుకు బడ్జెట్‌లో పెద్ద పీట వేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెంచిన సామాజిక పింఛన్లకు సరిపడా నిధులు బడ్జెట్‌లో కేటాయించాలని, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీతో పాటు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఎన్ని నిధులు అవసరమో అంత మేర బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు.

ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌ ఉండాలని సూచించారు. అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందేనని, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖమంత్రి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను ముఖ్యమంత్రి సమీక్షించడంతోపాటు నవరత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బడ్జెట్‌ రూపకల్పన, ప్రాధాన్యతలపై రెండు  మూడు దఫాలు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేని విధంగా దిగజారిందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొనటంతో ముఖ్యమంత్రి జగన్‌ స్పందిస్తూ ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అధిగమించి తీరాల్సిందేనని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల అమలుకు బడ్జెట్‌లో పెద్ద పీట వేయాల్సిందేనని స్పష్టం చేశారు. పెంచిన సామాజిక పింఛన్లకు సరిపడా నిధులు బడ్జెట్‌లో కేటాయించాలని, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీతో పాటు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, రైతులు చెల్లించాల్సిన పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఎన్ని నిధులు అవసరమో అంత మేర బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు.

ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌ ఉండాలని సూచించారు. అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందేనని, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదని ముఖమంత్రి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను సీఎం సమీక్షించడంతోపాటు నవరత్నాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు చేశారు. బడ్జెట్‌ రూపకల్పన, ప్రాధాన్యతలపై రెండు  మూడు దఫాలు అంతర్గతంగా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

అప్పులు తీసుకుని మళ్లించిన టీడీపీ సర్కారు...
టీడీపీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌లో రూ.2.48 లక్షల కోట్ల మేరకు అప్పులు చేయగా, బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో రూ.64 వేల కోట్ల వరకు  అప్పులు చేశారని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రికి  నివేదించారు. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులను వాటికోసం వెచ్చించకుండా ఇతర అవసరాలకు మళ్లించడంతో నిధుల కొరతతో సతమతమవుతున్నాయని వివరించారు. వివిధ రకాల పెండింగ్‌ బిల్లులు మొత్తం రూ.48 వేల కోట్ల వరకు ఉన్నట్లు ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా