పండుగలా జననేత జన్మదినం

22 Dec, 2019 04:09 IST|Sakshi

జిల్లాల్లో ఘనంగా వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు

పలుచోట్ల రక్తదాన శిబిరాలు.. ఊరూరా సేవా కార్యక్రమాలు

శ్రీకాకుళం: ఘనంగా పుట్టినరోజు వేడుకలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. కేక్‌ కటింగ్, రక్తదాన శిబిరాలు, పాలాభిషేకాలు నిర్వహించారు. శ్రీకాకుళం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి మంత్రి కృష్ణదాస్, కేంద్ర మాజీ మంత్రి కృపారాణి, దువ్వాడ శ్రీనివాస్‌ తదితరులు పాలాభిõÙకం నిర్వహించారు.  

విజయనగరంలో ఊరూవాడా సంబరం
విజయనగరం జిల్లాలోని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి కురుపాం సీహెచ్‌సీలో రక్తదానం చేశారు. విజయనగరంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సాలూరులో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నదానం నిర్వహించారు.

ప్రాణదాతా.. సుఖీభవ
అత్యంత పేద కుటుంబానికి చెందిన ఆరేళ్ల ఆ చిన్నారి కాలేయ మారి్పడి కోసం నెల క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రూ.25 లక్షలు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సాయంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన మల్లిపోగు నందిని.. విజయవంతంగా చికిత్స చేయించుకుంది. కాకినాడ డి కన్వెన్షన్‌లో శనివారం జరిగిన సీఎం పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆ చిన్నారితో కేక్‌ కట్‌ చేయించారు.  నందిని కుటుంబం ఆనంద భాష్పాలతో ‘ప్రాణదాతా సుఖీభవ’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వేడుకల్లో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ అనంత ఉదయభాస్కర్‌ పాల్గొన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించారు.

హిందూపురంలో హెలికాప్టర్‌తో పూలవర్షం
సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలను అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎస్కే వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విద్యార్థుల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తదితరులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. హిందూపురంలో పార్టీ పార్లమెంట్‌ అధ్యక్షుడు నవీన్‌ నిశ్చల్‌ ఆధ్వర్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటంతో కూడిన 60 అడుగుల భారీ కటౌట్‌పై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించారు.  

గుంటూరు జిల్లాలో..
సీఎం జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లాలో జరిగాయి. సిమ్స్‌ గ్రూప్‌ సంస్థ డైరెక్టర్‌ భీమనాథం భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల శాఖ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని మరణానంతరం అవయవదానానికి ముందుకు వచ్చిన విద్యార్థులకు అంగీకార పత్రాలు అందజేశారు.  

సీఎం పథకాలు భేష్‌: రాపాక

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు బాగున్నాయని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కొనియాడారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజల ఆశీస్సులుంటాయని, మేనిఫెస్టోలో లేనివి కూడా జగన్‌ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి చేనేత సొసైటీలో నేతన్న నేస్తం పథకం ప్రారంభోత్సవంలో మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ అమ్మాజీతో పాటు వరప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పుట్టిన రోజు కేక్‌ను అమ్మాజీ కట్‌ చేశారు. సీఎం ఫ్లెక్సీకి ఎమ్మెల్యే వరప్రసాదరావు క్షీరాభిషేకం చేశారు.

రాజమండ్రిలో 2,043 మంది రక్తదానం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జక్కంపూడి రామ్మోహన్‌రావు ఫౌండేషన్‌ నిర్వాహకులు జక్కంపూడి గణే‹Ù, రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజానగరం నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. 2043 మంది రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. ముగింపు కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, పినిపే విశ్వరూప్, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, సిటీ, రూరల్‌ కోఆర్డినేటర్లు శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

రేపల్లెలో 405 మంది రక్తదానం
సీఎం పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 405 మంది రక్తదానం చేశారు. సెపె్టంబర్‌ 2న వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా రైతు దినోత్సవం నాడు నిర్వహించిన శిబిరంలో నమోదైన రికార్డును వీరు అధిగమించారు.

కోడుమూరులో 365 మంది రక్తదానం
కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోట్ల హర్ష యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అరుదైన గుర్తింపు లభించింది. గతంలో ఒకేసారి 304 మంది నుంచి రక్తాన్ని సేకరించగా.. ఇప్పుడు 365 మంది నుంచి రక్తాన్ని సేకరించి పాత రికార్డును అధిగమించామని రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు