'పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు'

10 Jun, 2020 13:17 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం 'జగనన్న చేదోడు' పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. బుధవారం రోజున సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో.. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున నగదును జమచేశారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం చూపిన చొరవకు లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా లబ్ధిదారులు తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కోటిపల్లి రామతులసి మాట్లాడుతూ..  ప్రతి పేద కుటుంబం సీఎం జగన్‌కు రుణపడి ఉంటుంది. నవరత్నాలు పేదల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. గవర్నమెంట్‌ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా పెన్షన్లు ఇస్తున్నారు. ఇంక్రిమెంట్‌ పెరిగినట్టుగా పెన్షన్‌ పెంచుతున్నారు, అవ్వతాతలు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. పేదోళ్ల గుండెల్లో మీరు దేవుడిగా నిలిచిపోతారు. నేనున్నానని చెప్పిన విధంగానే మాకు మీకు సాయపడుతున్నారు. కరోనా సమయంలో బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేకపోవడంతో మీరు అందించిన సాయం ఎంతగానే అక్కరకొచ్చింది. రాబోయే తరంలోనూ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి' అంటూ రామతులశమ్మ ఉద్వేగానికి లోనైంది. చదవండి: ‘జగనన్న చేదోడు’ ప్రారంభం

వాలంటీర్ల వ్యవస్థ అద్భుతం
చిన్న పిల్లలకు ఓటు హక్కు ఉండదని ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోవు. అమ్మఒడి పథకం ద్వారా మా పిల్లలకు చేయూత ఇచ్చారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పేదలకు ఏ పథకం రావాలో వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చెప్తున్నారు. మా గురించి ఇంతగా ఆలోచించిన పాలకులు ఎవరూ లేరు. ఐదేళ్లలో చేయాల్సిన పనులను ఏడాదిలోనే చేసి చూపించారు.
-ఎం. హేమావతి(రజకురాలు), అనంతపురం


నాయీ బ్రాహ్మణులు మీకు రుణపడి ఉన్నారు
వాలంటీర్ నేరుగా మా షాప్‌కు వచ్చి లబ్ధిదారుడిగా ఎంపిక చేశారు. 30 ఏళ్లుగా నేను ఇలాంటి స్కీమ్ చూడలేదు. లబ్ధిదారుల్లో నా పేరు ఉండటం సంతోషాన్ని కలిగించింది. నాయీ బ్రాహ్మణులు మీకు రుణపడి ఉన్నారు. మీ నాన్న దయగారి వల్ల నాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడు మీ దయతో నా మేనల్లుడికి స్థలం వచ్చింది. తరతరాలకు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి.
- పైడియ్య (నాయీ బ్రాహ్మణుడు) - శ్రీకాకుళం

మా గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారు
జగనన్న చోదోడుతో కరోనా సమయంలో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. మరో 50 ఏళ్లు జగన్‌ సీఎంగా ఉండాలి. గ్రామ సచివాలయాలు నిర్మించి ఎంతో మంచిపని చేశారు. గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసిన నాయకుడు వైఎస్‌ జగన్‌. మీరు ధన్యులు సార్‌, మా గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారు.
-రామకోటేశ్వరరావు (దర్జీ) - పశ్చిమ గోదావరి

మరిన్ని వార్తలు