నూతన ఒర'బడి'

11 Jul, 2020 12:07 IST|Sakshi

జగనన్న విద్యాకానుకతో ప్రభుత్వ పాఠశాలలకు నూతన శోభ

తరగతుల ప్రారంభం రోజే షూ, బ్యాగులు, పుస్తకాలు,యూనిఫాం అందజేత

ఇప్పటికే ఎమ్మార్సీలకు చేరుకున్న నోట్‌ పుస్తకాలు

జిల్లాలో 3,44,787 మంది విద్యార్థులకు లబ్ధి

ప్రమాణాలు మెరుగవుతాయంటున్న విద్యావేత్తలు  

గుంటూరు ఎడ్యుకేషన్‌/ సత్తెనపల్లి: ప్రభుత్వ పాఠశాలలంటే నిన్నమొన్నటి వరకు అందరికీ చిన్న చూపు. అక్కడ సరైన వసతులు ఉండవు, విద్యార్థులకు సరైన విద్య అందదనే అభిప్రాయం ఉండేది. నేడు ఆ పరిస్థితి మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి అపోహలకు తావు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి  పాఠశాలల రూపు రేఖలు మార్చి నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పిల్లల్ని  చదివించే ఏ తల్లి దండ్రులు ఆర్ధికగా ఇబ్బందులు పడకూడదని, అమ్మ ఒడి. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులతో పాటు, నాడు–నేడుతో కార్పొరేట్‌ స్థాయి విద్యావసతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఈ ఏడాది ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా పాఠశాలలు తెరిచిన మొదటి రోజే ప్రతి విద్యా  ర్థికి జగనన్న విద్యా కానుక అందజేయాలని నిర్ణయించారు. 

విద్యా కానుకలో ఉండేవి ఇవే..  
విద్యా కానుకలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్, టెక్ట్స్,నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, నోటు పుస్తకాలు అందించనున్నారు.  కాగా, ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించేందుకు ఉద్దేశించిన నోట్‌బుక్స్‌ జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోని 3,663 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3,44,787 మంది విద్యార్థులకు 202–21 విద్యాసంవత్సరంలో జగనన్న విద్యాకానుకలో భాగంగా ప్లెయిన్, చెక్‌రూళ్లు మొదలైన నోట్‌బుక్స్‌తో కూడిన పుస్తకాల బండిల్‌ను అందించనున్నారు.  గురువారం గుంటూరులోని స్టాల్‌ బాలికోన్నత పాఠశాలలో ఉంచిన నోటు పుస్తకాలను జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.ఎస్‌.గంగాభవానీ పరిశీలించారు.  ఆమె మాట్లాడుతూ..పాఠశాలలు తెరిచే నాటికి టెక్ట్స్, నోట్‌బుక్స్, యూనిఫాం, బూట్లు, సాక్సులను కలిపి ఓ కిట్‌గా తయారు చేసి బ్యాగులో పెట్టి విద్యార్థులకు అందజేస్తామని అన్నారు.  గుంటూరు ఎంఈవో అబ్ధుల్‌ ఖుద్ధూస్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు