జగన్ నిర్బంధం చట్ట విరుద్ధం

30 Jul, 2013 01:38 IST|Sakshi
జగన్ నిర్బంధం చట్ట విరుద్ధం

అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్రపన్ని రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణగల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ సాయంతో అక్రమంగా అరెస్ట్ చేయించారని మేధావివర్గం అభిప్రాయపడింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య అని స్పష్టం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాలులో సోమవారం నాగరాజు వ్యాఖ్యాతగా నిర్వహించిన ‘సాక్షి’ చైతన్యపథం చర్చావేదికలో పలువురు మేధావులు మాట్లాడారు. సీనియర్ న్యాయవాది ఎంవీ రామారెడ్డి మాట్లాడుతూ, 14 నెలల నుంచి అధికార,ప్రతిపక్ష  పార్టీ కుమ్మక్కై వైఎస్ జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తున్నాయన్నారు. జగన్ విషయంలో దర్యాప్తు పూర్తిచేయకుండా ముక్కలు ముక్కలుగా చార్జిషీట్‌లు వేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారన్నారు.
 
జనవిజ్ఞాన వేదిక కన్వీనర్ డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ మాట్లాడుతూ, వ్యక్తిస్వేచ్ఛ కు, మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలన్నారు. పాల కొల్లు మర్చంట్స్ చాంబర్ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణ మాట్లాడుతూ, జగన్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడిందనే విషయం ప్రజల్లో బలంగా ముద్రపడిపోయిందన్నారు. రోటరీ మహిళాక్లబ్ అధ్యక్షురాలు నడింపల్లి అన్నపూర్ణ మాట్లాడుతూ, జగన్ కుటుంబాన్ని కుట్రపూరితంగా వేధించడం తగదన్నారు. సత్యమేవ జయతే అన్న సూక్తి ప్రకారం ఆగస్టు 15 కల్లా ఆయనను విడుదల చేయాలని అన్నపూర్ణ కోరగా, విద్యార్థులంతా చప్పట్లు కొట్టి హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. రిటైర్డ్ అధ్యాపకుడు ఆర్.నాగేశ్వరరావు మాట్లాడుతూ, చట్టం చిన్న లోపాన్ని పట్టుకుని సాగదీస్తూ జగన్‌ను వేధిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు