ఏర్పేడు బాధితులకు నేడు జగన్‌ పరామర్శ

23 Apr, 2017 02:23 IST|Sakshi
ఏర్పేడు బాధితులకు నేడు జగన్‌ పరామర్శ

వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి వెల్లడి

తిరుపతి మంగళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఆదివారం ఏర్పేడు ఘటన బాధితులను పరామర్శించేందుకు వస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌ రేణిగుంట విమానాశ్రయానికి చేరు కుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన మునగలపాళెం, ముసిలిపేడు, రావిళ్లవారి పల్లె అరుంధతివాడ ప్రాంతాలకు చేరుకుని ఏర్పేడులో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామ ర్శిస్తారని తెలిపారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా ముందుగా స్పందించి వారి పక్షాన నిలబడి బాధితులకు న్యాయం జరిగేలా పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్‌ అని నారాయణస్వామి అన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు