చంద్రగిరి మండలంలో జల్లికట్టు సంబరాలు

22 Dec, 2019 13:25 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం కందులవారుపల్లిలో జల్లికట్టు సంబరాలు ఘనంగా జరిగాయి. కోడెగిత్తలను ఉరికిస్తూ యువత ఈ వేడుకలో పాల్గొన్నారు. కోడెగిత్తలను పట్టుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నించారు. ఎద్దుల కొమ్ములకు ఉన్న బహుమతులు పొందేందుకు ఎగబడ్డారు. అయితే, కోడె గిత్తల వేగాన్ని అందుకోలేక యువకులు కొంత బేజారెత్తిపోయారు. ఈ క్రమంలో పోటీలో పాల్గొన్న పలువురు యువకులకు గాయాలయ్యాయి. జల్లికట్టు వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా