500 ఏళ్ల చరిత్ర జామియా మసీదు సొంతం

5 Jul, 2015 17:59 IST|Sakshi
500 ఏళ్ల చరిత్ర జామియా మసీదు సొంతం

బేతంచెర్ల (కర్నూలు జిల్లా): పవిత్ర రంజాన్ మాసంతో పాటు ఆయా సందర్భాలలో ప్రార్థనలు నిర్వహించే జిల్లాలోని మసీదులకు ఆయా ప్రాంతాల్లో ఒక్కొ చరిత్ర ఉంది. అదే విధంగా బేతంచెర్ల జామియా మసీదు 500 సంవత్సరాల క్రితం నిర్మితమైనట్లు మండల ఖాజీ నూర్ అహ్మద్ పేర్కొన్నారు. 15 వ శతాబ్దంలో పునాదులు లేకుండా దీనిని నిర్మించారని తెలిపారు.

పెనుగొండ బాబా ఫకృద్ధీన్ శిష్యులైన ఇరాక్ దేశస్థులు మౌలానా మహమ్మద్ ముస్తఫా అరబి, మౌలానా నూర్ అలినూర్ ఈ మసీదు నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని గత రెండు సంవత్సరాలుగా కొత్తగా జామీయా మసీదు నిర్మాణం చేస్తున్నారు. ఇందులో 500 మంది ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించుకోవచ్చు.

మరిన్ని వార్తలు