జన్మభూమి రసాభాస

8 Oct, 2014 00:00 IST|Sakshi
జన్మభూమి రసాభాస

మాచర్లలో అధికారులను నిలదీసిన లబ్ధిదారులు

 మాచర్ల టౌన్
 పట్టణంలోని 3వ వార్డు నెహ్రూనగర్‌లో మంగళవారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం రసాభాసగా మారింది. ఉదయం 11 గంటల సమయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి, వార్డు కౌన్సిలర్ షేక్ కరీముల్లాల సమక్షంలో కమిషనర్ మురళీకృష్ణ జన్మభూమి కార్యక్రమం చేపట్టారు.

  సభ ప్రారంభించిన వెంటనే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వే దికపైకి వచ్చి ‘మా పింఛన్లను తొలగిస్తారా మేమేం పాపం చేశాం’ అంటూ అధికారులను నిలదీశారు. ఏ కారణంతో పింఛన్ తొలగించారో సమాధానం చెప్పేవరకు సభ జరగనీయబోమంటూ అధికారులతో వాదనకు దిగారు.

  మున్సిపల్ చైర్‌పర్సన్ స్పందిస్తూ తొలగింపులపై మళ్లీ విచారణ జరుపుతామని ఓపిక పట్టాలని కోరారు. ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ షేక్ క రీముల్లా మాట్లాడుతూ అర్హత ఉన్న వారిని తీసివేయడం వల్లే సమస్యలు వస్తున్నాయని, ఒక్కొక్కరిని పిలిచి సమస్య తెలుసుకోవా లంటూ అధికారులకు సూచించారు. ఈ లోగానే వృద్ధులు, మహిళలు వేదికపైకివచ్చి నిరసన తెలపడంతో సభ గందరగోళంగా మారింది.

      పట్టణ ఎస్‌ఐ సింగయ్య, సిబ్బందితో రంగప్రవేశం చేసి వారిని కిందకు పంపారు.
అనంతరం కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ పింఛన్ కోల్పోయిన వారి దరఖాస్తులను స్వీకరించి రెండు రోజుల్లో విచారించి అర్హత కలిగిన వారందరికీ పింఛన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటమాని చెప్పారు. చివరకు బిల్ కలెక్టర్  రామారావు పింఛన్‌దారుల దరఖాస్తులను స్వీకరించారు.

      కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు రామమునిరెడ్డి, మురళీ, కారుమంచి బుల్లయ్య, ప్రవీణ్‌కుమార్, గులాం రసూల్, నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బోయ రఘురామిరెడ్డి, పోల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గోపవరపు మల్లిఖార్జునరావు, ఉడతా సత్యం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 వైద్య శిబిరం...
     పట్టణంలోని మూడు, నాలుగు, ఐదు, ఆరు వార్డుల్లో బుధవారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు సుధాకర్‌రెడ్డి, దంత వైద్యులు కురిమేటి జయప్రకాష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

 అడిగొప్పులలో...
 అడిగొప్పుల(దుర్గి): మండలంలోని అడిగొప్పుల గ్రామంలో మంగళవారం జరిగి న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం రసాభాసగా మారింది.  ప్రత్యేక అధికారి విజయకుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన జన్మభూమి సభలో పింఛన్ దారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గ్రామంలో వున్న 748 పింఛన్లకు 226 పింఛన్లు తొలగించడం పట్ల లబ్ధిదారులు ఒక్కసారిగా అధికారులపై మండిపడ్డారు.

      {V>Ð]l$…లో వీధిలైట్లు, మురుగు కాల్వల పూడిక తీత వంటి పనులు నిర్వహించకుండా నిధులను దారి మళ్లించారని ఆరోపిస్తూ సర్పంచ్ వలపా చిన్న రాములును గ్రామస్తులు నిలదీశారు.
     అర్హత కలిగిన వారి పెన్షన్లు తొలగించి టీడీపీకి చెందిన వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించటం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.

  అధికారులను నిలదీస్తున్న సమయంలో పలువురు టీడీపీ నాయకులు అధికారులకు వత్తాసు పలకడంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

      చివరకు ఎస్‌ఐ సుబ్బారావు స్పందించి ఇరువైపులా సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
      అనంతరం మిగిలిన లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. - వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు