నేడు జన్‌ సదరన్‌ ప్రత్యేక రైళ్లు

12 Jan, 2019 11:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా రైళ్లలో రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే శనివారం పలు మార్గాల్లో జన్‌ సదరన్‌ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లలో రిజర్వేషన్లు ఉండవు. కేవలం 16 సెకండ్‌ క్లాస్‌ బోగీలు, రెండు లగేజ్, బ్రేక్‌ వ్యాన్‌లు మాత్రమే ఉంటాయి. ప్రత్యేక చార్జీలు వసూలు చేయరు.

సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు సాధారణ టికెట్‌ రూ.130, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.135, తిరుపతి నుంచి కాకినాడకు రూ.175, విజయవాడ నుంచి విజయనగరానికి రూ.145 చార్జీగా వసూలు చేస్తారు.

సికింద్రాబాద్‌–విజయవాడ (07192) ప్రత్యేక రైలు 12న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌–విజయవాడ (07194) ప్రత్యేకరైలు 12న రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. విజయవాడ–హైదరాబాద్‌ (07193) ప్రత్యేక రైలు 12న రాత్రి 8.30 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది.

తిరుపతి–కాకినాడ (07190) ప్రత్యేక రైలు 12న రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. విజయవాడ–విజయనగరం (07184) ప్రత్యేక రైలు 12న రాత్రి 10.10 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. విజయవాడ–సికింద్రాబాద్‌ (07195), విజయనగరం–విజయవాడ (07185) ప్రత్యేకరైళ్లు 12వ తేదీ నడుస్తాయి. 

మరిన్ని వార్తలు