‘చేయని నేరానికి ఏపీ ప్రజలకు శిక్ష’ 

17 Feb, 2018 02:19 IST|Sakshi

సాక్షి, అమరావతి: చేయని నేరానికి ఏపీ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన జనసేన నిజనిర్ధారణ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. ఈ భేటీకి లోక్‌సత్తా నేత జేపీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాల్‌ గౌడ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, సీపీఐ, సీపీఎం కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, కాంగ్రెస్‌ నాయకులు గిడుగు రుద్రరాజు, గౌతమ్, న్యాయవాది ప్రమోద్‌రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్, మాజీ ఎంపీ కొణతాల, తోట చంద్రశేఖర్‌ తదితరులు హాజరయ్యారు. భేటీలో హోదా తదితర అంశాలపై అధ్యయనానికి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు, ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన టి.చంద్రశేఖర్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు