పేరెంట్స్‌ మీటింగ్‌కు వచ్చి..

20 May, 2020 13:02 IST|Sakshi
అంధ విద్యార్థులకు మాస్కులు కడుతున్న జె.సి.రాజు, ఎంఈఓ, ప్రిన్సిపాల్‌

లాక్‌ డౌన్‌తో బొబ్బిలిలో ఇరుక్కుపోయిన అంధ విద్యార్థుల తల్లిదండ్రులు  

జార్ఖండ్‌కు తరలించే ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్‌

బొబ్బిలి: బొబ్బిలి సమీపంలోని ఏసియన్‌ ఎ యిడెడ్‌ బ్లైండ్‌ స్కూల్‌లో చదువుతున్న తమ అంధ పిల్లల బాగోగుల కోసం స్కూల్‌లో ఏ ర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశానికి వ చ్చిన వారంతా విద్యార్థులతో పాటు లాక్‌ డౌన్‌ వల్ల ఇక్కడ చిక్కుకు పోయారు. మార్చి 23న నిర్వహించిన సమావేశానికి వచ్చిన సుమారు 17 మంది విద్యార్థుల తల్లిదండ్రులు లాక్‌ డౌన్‌   వల్ల ఇక్కడే ఉండిపోయారు.ఇప్పటి వరకూ వా రు ఇక్కడ ఉండిపోయిన విషయం బయట కు తెలియలేదు. వారికి మాస్క్‌లు, శానిటైజర్‌లు కూడా లేవు. విషయం తెలిసిన కారుణ్య ఫౌండేషన్‌ అధ్యక్షుడు జె.సి.రాజు, ఎంఈఓ చల్ల లక్ష్మణరావు ప్రిన్సిపాల్‌ ప్రభుదాస్‌తో కలసి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్స్‌ అందజేశారు. సరిగ్గా అదే సమయానికి కలెక్టరే ట్‌ నుంచి విద్యార్థులను, తల్లిదండ్రులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. ప్రభుత్వం వీరిని తరలించే చ ర్యలు తీసుకోవడాన్ని పలువురు అభినందించారు.  

మరిన్ని వార్తలు