అందుకే చైనా కిట్లను తీసుకోలేదు

29 Apr, 2020 21:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతోనే కరోనా పరీక్షలు చేసేందుకు చైనా కిట్లను తీసుకోలేదని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహార్ ‌రెడ్డి పేర్కొన్నారు. సౌత్‌కొరియా నుంచి మాత్రమే కరోనా టెస్ట్‌ కిట్లను దిగుమతి చేసుకున్నామని, ఐసీఎంఆర్‌ ఆమోదించాకే వాటిని పరీక్షలకు ఉపయోగించామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘  దేశంలో అత్యధికంగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఏపీ. మిలియన్‌కు 1,649 వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఇప్పటివరకు ఏపీలో 88,061 మందికి పరీక్షలు చేశాం. ( అందుకే ఏపీలో ఎక్కువ కరోనా కేసులు )

ఇప్పటికే 9 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. రెండురోజుల్లో మరో మూడు ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి. ట్రూనాట్‌ ద్వారా 3500 పరీక్షలు చేస్తున్నాం. వీఆర్‌డీఎల్‌ ద్వారా 4వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. కరోనాపై ప్రతిరోజూ సీఎం జగన్‌ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు 90 నుంచి 7,750 పరీక్షలు చేసే సామర్థ్యానికి చేరుకున్నా’’మని అన్నారు.

మరిన్ని వార్తలు