కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ నెంబర్‌ 1

23 May, 2020 16:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని వైద్య శాఖ ఖాళీలను భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, త్వరలో 9700కి పైగా డాక్టర్లు, వైద్యసిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని  వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కరోనా వైరస్‌ నియంత్రణ కోసం మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వస్తున్నందున అదనపు బెడ్లు సిద్ధం చేస్తున్నాం. హై రిస్క్ ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రయాణికులందరికీ పరీక్షలు చేస్తాం. త్వరలో విమానాలు కూడా వస్తున్నందున వారికి కూడా పరీక్షలు చేస్తాం. 8 జిల్లాల్లో 30 వేల ఐసోలేషన్ బెడ్లను ఏర్పాటు చేస్తాం. ( వారంలో జిల్లా గ్రీన్‌జోన్‌ )

12 వేల వరకు ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నాం. ఆక్సిజన్ లైన్లను కూడా సమకూర్చుతున్నాం. అనంతపురం, గుంటూరు, క్రిష్ణా, కర్నూలు, విశాఖ, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరిలలో బెడ్ల సంఖ్యను పెంచుతున్నాం. వైద్య పరీక్షల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం. రేపటికి వైద్య పరీక్షల సంఖ్య 3 లక్షలు దాటుతుంది’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు