కరోనా టెస్టుల్లో ఏపీ నంబర్‌వన్‌

21 Jun, 2020 20:10 IST|Sakshi

ఇప్పటివరకు 6.76 లక్షలకు పైగా కరోనా టెస్టులు

వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి

సాక్షి,అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రథమస్థానంలో ఉందని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో కరోనా టెస్టుల ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 90 టెస్టుల సామర్ధ్యంతో మొదలుపెట్టి 24వేల టెస్టులు చేసే స్థాయికి వచ్చామని పేర్కొన్నారు.సీఎం జగన్ ఆదేశాలతో పూర్తి స్థాయిలో టెస్టులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. (కోవిడ్‌కు హైదరాబాద్‌ ఇంజెక్షన్‌ రెడీ)

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6.76 లక్షలకు పైగా టెస్టులు చేశామన్నారు.10 లక్షల మందికి సగటున 12,675 మందికి కరోనా టెస్టులు నిర్వహించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని గుర్తించి క్వారంటైన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘వాలంటీర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇంటింటి సర్వే చేశాం. సర్వే ద్వారా అస్వస్థతతో ఉన్నవారిని గుర్తించి టెస్టులు చేస్తున్నామని’ జవహర్‌రెడ్డి వెల్లడించారు. (ఏపీలో కొత్తగా 477 కరోనా కేసులు)

మరిన్ని వార్తలు