‘మృతదేహాల విషయంలో అపోహలు వద్దు’

3 Jul, 2020 19:54 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఇప్పటి వరకు 9.7 లక్షల మందికి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నిర్ధారణ పరీక్షల నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. మిలియన్‌కు 18200 మందికి పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణ రంగం, వ్యవసాయ కూలీలు, కూరగాయలు, పండ్ల మార్కెట్లలో కూలీలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 20వేల మంది వలస కూలీలకు పరీక్షలు చేశామని.. రెండు వేల మందికిపైగా కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఏడు వేల మంది ఆస్పత్రుల్లో, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అన్‌లాక్‌ ప్రారంభమయ్యాక దేశంలో, రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని.. ఈ నేపథ్యంలో వైరస్‌ ఏ రకంగా వ్యాప్తి చెందుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచామని.. ఇప్పటి వరకు 22 వేల మంది ఐఎంఏ డాక్టర్స్‌ను గుర్తించి శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. (ఏపీ: రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు)

హోం ఐసోలేషన్‌కు అనుమతినిచ్చాం
‘‘మార్చి 9 నాడు  ఏపీలో తొలి కేసు నమోదైంది. ఇతర రాష్ట్రాలు నుంచి వచ్చిన 2111 మందికి పాజిటివ్ వచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 409కి కరోనా సోకింది. ఈరోజు 15 వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లు, ప్రైవేట్ 4 లాబ్‌లలో కరోనా పరీక్షలు చేస్తున్నాం. 9లక్షలు 70 వేల మందికి కరోనా టెస్టులు చేశారు. మార్చి 24 వరకు 9 కేసులు వచ్చాయి.. కానీ అన్‌లాక్ తర్వాత జూన్ 1 నుంచి నేటి వరకు 13252 కేసులు నమోదయ్యాయి. వివిధ రకాలుగా.. టెస్టింగ్ ఫర్ సర్వైలెన్స్ ఆధారంగా పరీక్షలు చేస్తున్నాం. బయటి నుంచి వచ్చిన వాళ్ళు, అగ్రికల్చర్ లేబర్స్, ఫ్రూట్ వెండర్స్, పరిశ్రమల్లో కూలీలు, హెల్త్ కేర్, పారిశుద్ధ్య కార్మికులు, సేల్స్ కేటగిరి వాళ్ళకు పరీక్షలు చేస్తున్నాం. 

హెల్త్ కేర్ వర్కర్స్ 12500 మందికి పరీక్షలు చేస్తే.. 2.5 % నమోదు అయ్యాయి. వీటిలో గుంటూరు , చిత్తూరు జిల్లా లో ఎక్కువగా కేసులు నమోదు అయ్యాయి. ఆరోగ్య సేతు యాప్ ద్వారా బ్లూ టూత్  15 వేల మందికి పరీక్షలు చేస్తే  400 పాజిటివ్ కేసులు నమోదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 2500 మందికి పరీక్షలు చేస్తే 1.5 % పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దేవాలయాలకు వెళ్లిన వారికి పరీక్షలు చేస్తే  1.46 % నమోదయ్యాయి. 2.46 % విశాఖపట్నంలో నమోదు. వీటిలో ఎక్కువ మంది హోమ్ ఐసోలేషన్‌కు అవకాశం ఇస్తున్నాం. 400 మందికి పైగా హోం ఐసోలేషన్‌కు అనుమతి ఇచ్చాం. రెండు వేలమంది కోవిడ్ కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. 7 వేల మంది ఆసుపత్రిలో, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

మృతదేహాల విషయంలో అపోహలు వద్దు..
‘‘9 వేల మంది నియామకానికి జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చాం. 22 వేల మంది ఐ.ఎం.ఏ డాక్టర్లను గుర్తించాం. శిక్షణ ఇస్తున్నాం. కరోనా నియంత్రణకు ముందుకు వెళ్తున్నాం. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. లాక్‌డౌన్ వల్లనే సమస్య పరిష్కారం కాదు. మాస్క్ విధిగా ప్రజలు ధరించాలి. వృద్దులు, పిల్లల్ని బయటకు పంపించవద్దు. కరోనా వల్ల ఒక మరణం 660 కేసులు ఉన్నట్లు లెక్క.  రాష్ట్రంలో 1.22% ఇన్ఫెక్షన్ శాతం ఉంది. కృష్ణాజిల్లాలో 4.2 , కర్నూల్ 4.40% ఇన్ఫెక్షన్ శాతం ఉంది. యూనిసెఫ్ సహాయం తో  కోటి నలబై లక్షలు కుటుంబాలకు డైరెక్ట్ సమాచారం ఇస్తున్నాం. కరోనా వల్ల చనిపోయిన వారి నుంచి 4 నుంచి 6 గంటల వరకు వారివల్ల వైరస్ వ్యాపించదు. 
ఎలాంటి భయాందోళనలు వద్దు. మృతదేహాల విషయంలో అపోహలు వద్దు’’ అని జవహర్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా