జయంతికి కష్టమొచ్చింది

30 Apr, 2018 13:01 IST|Sakshi
ఇబ్బందికరంగా నడుస్తున్న శిక్షణ ఏనుగు జయంతి

కాలుకు రాయి గుచ్చుకోవడంతో

నడవలేకపోతున్న ఏనుగు

కాశీబుగ్గ: జిల్లాలో ఏనుగుల తరలింపునకు ఆపరేషన్‌ గజేంద్ర జరుగుతోంది. ఇందులో పాల్గొన్న శిక్షణ ఏనుగుల్లో ఒకటి జయంతికి కష్టమొచ్చింది. గత కొన్నిరోజులుగా 8 ఏనుగుల గుంపును దారి మళ్లించేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు గణేష్‌(మగ ఏనుగు), జయంతి(ఆడ ఏనుగు) అనే శిక్షణ ఏనుగులను తీసుకొచ్చారు.

ఇవి ఏనుగుల గుంపు తరలింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ తరుణంలో జయంతి ఏనుగు కాలికి రాయి గుచ్చుకోవడంతో తీవ్ర నొప్పితో ఇబ్బంది పడుతుంది. కాలు ఉబ్బిపోవడంతో నడవడానికి ఇబ్బందికరంగా మారింది. విశాఖపట్నం నుంచి ప్రత్యేక వైద్యులు వచ్చి వైద్యం అందించారు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం పలాస మండలంలో తర్లాకోట పంచాయతీలో ఆపరేషన్‌ గజేంద్రలో భాగంగా ఏనుగుల తరలింపు జరుగుతోంది.

మరిన్ని వార్తలు