జయశ్రీ జైత్రయాత్ర

10 Jun, 2019 13:38 IST|Sakshi
జయశ్రీ వైష్ణవి వర్మకు స్వీటు తిన్పిస్తున్న తండ్రి కేఎల్‌ఎన్‌ రాజు

 పరీక్ష ఏదైనా ఉత్తమ ర్యాంకు రావాల్సిందే

టీఎస్‌ ఎంసెట్‌లోనూ 47వ ర్యాంకు  

ఏపీ ఎంసెట్, నీట్, జిప్‌మర్‌లో విజయభేరి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలుకు చెందిన కె.జయశ్రీ వైష్ణవి వర్మ ఉత్తమ ర్యాంకులకు కేరాఫ్‌గా మారింది. పోటీ పరీక్ష ఏదైనా సరే మంచి ర్యాంకుతో సత్తా చాటుతోంది. ఇప్పటికే ఏపీ ఎంసెట్, నీట్, జిప్‌మర్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన జయశ్రీ ఆదివారం విడుదలైన తెలంగాణ ఎంసెట్‌లోనూ రాష్ట్రస్థాయిలో  47వ ర్యాంకుతో సత్తా చాటింది. మెడికల్‌ విభాగంలో 142 మార్కులు సాధించి.. ఈ ర్యాంకును కైవసం చేసుకుంది. వైద్యురాలు కావాలన్న లక్ష్యం, కఠోర శ్రమ, తల్లిదండ్రుల తోడ్పాటు, అధ్యాపకుల సహకారం వల్లే ప్రతిభ చూపుతున్నట్లు జయశ్రీ చెబుతోంది.

నాలుగు పోటీ పరీక్షల్లో టాప్‌ ర్యాంకు
జయశ్రీ వైష్ణవి వర్మ ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసింది. తండ్రి కేఎల్‌ఎన్‌రాజు వైద్యుడు. ఆయన కల్లూరు మండలంపర్ల రూరల్‌ హెల్త్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి స్ఫూర్తితో వైద్యురాలు కావాలన్న జీవిత లక్ష్యంతో జయశ్రీ శ్రమించింది. రెండేళ్ల పాటు పండుగలు, ఇతరత్రా కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండి చదివింది. ఫలితంగా ఇంటర్‌లో 10/10 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించింది. ఏపీ ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు, నీట్‌లో ఆలిండియా స్థాయిలో 104వ ర్యాంకు, జిప్‌మర్‌లో 87వ ర్యాంకుతో సత్తా చాటింది. ఇప్పుడు టీఎస్‌ ఎంసెట్‌లోనూ 47వ ర్యాంకు సాధించడంతో ఆమె ప్రతిభను పలువురు మెచ్చుకుంటున్నారు.

హర్షితకు 75వ ర్యాంకు
 జిల్లాకు చెందిన మరో విద్యార్థిని హర్షితకు టీఎస్‌ ఎంసెట్‌లో 75వ ర్యాంకు వచ్చింది. మొత్తం 139 మార్కులతో ఈ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈమె నీట్‌ పరీక్షలోనూ ఆలిండియా స్థాయిలో 3,747 ర్యాంకు సాధించడం గమనార్హం. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబు తీరు ఇంకా మారలేదు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఏపీలో 38 మంది డీఎస్పీలు బదిలీ

ఏపీకి కొత్త గవర్నర్‌

చిరునవ్వుతో స్వాగతించాలి : సీఎం జగన్‌

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

పరిశీలనలో వెనుకబడిన జిల్లాల నిధులు

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

కాంచీపురంలో టీటీడీ చైర్మన్‌ దంపతులు

వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం: వైఎస్‌ జగన్‌

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

80 శాతం గ్రీవెన్సెస్‌ వాటికి సంబంధించినవే : సీఎం జగన్‌

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

టీడీపీ నేతలకు అంబటి చురకలు..!

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ 

పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

అరకులోయలో మహిళా డిగ్రీ కళాశాల

నిధులు చాలక..నత్తనడక

ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు

7 నుంచి చెన్నై సంత్రాగచ్చి వీక్లీ స్పెషల్‌

సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం

దివిసీమలో గాలివాన బీభత్సం

ధర్నాలతో దద్దరిల్లిన కాకినాడ కలెక్టరేట్‌

ఈ బండి.. తోస్తే గానీ కదలదండీ !

పెన్సిల్‌ ముల్లుపై షిర్డీసాయిబాబా 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’