ముందస్తు ఎన్నికలపై పవన్‌ కల్యాణ్‌ ట్విట్‌

23 Apr, 2017 02:09 IST|Sakshi
ముందస్తు ఎన్నికలపై పవన్‌ కల్యాణ్‌ ట్విట్‌

హైదరాబాద్‌ : జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్‌ కల్యాణ్‌ ముందస్తు ఎన్నికలపై స్పందించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్‌ ట్విట్‌ చేశారు. ఎన్నికల యుద్ధానికి జనసేన సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కాగా పవన్‌ ఇప్పటికే పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్‌ క్లారిటీ ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు