పొలాల్లో జెట్‌ ఫ్లైట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

17 Feb, 2020 12:29 IST|Sakshi

సాక్షి, అనంతపురం: సాంకేతిక లోపం కారణంగా ఓ జెట్‌ విమానం అనంతపురం జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. సోమవారం ఉదయం బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ సమీపంలోని పొలాల్లో జెట్‌ ఫ్లయిట్‌ ఎమర్జెన్సీ ల్యాండైంది. అయితే అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారు. ఈ విమానం మైసూర్‌ నుంచి బళ్లారిలోని జిందాల్‌ ఫ్యాక్టరీకి  వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా