దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఆభరణాలు దోపిడీ

22 Sep, 2015 11:04 IST|Sakshi

దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడి ఆభరణాలను దుండగులు దోచుకున్నారు. ప్రాథమిక సమచారం మేరకు... విశాఖ గీతం వర్సిటీలో మెడికల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కేఎల్‌వీ రావు సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం బయల్దేరారు. మంగళవారం ఉదయం రైలు అనకాపల్లికి చేరుకున్న సమయంలో ప్రొఫెసర్ రావు తన బ్యాగు చూసుకోగా అందులోని బంగారు ఆభరణాల బాక్స్ కనిపించలేదు. దీంతో విశాఖలో రైలు దిగిన తర్వాత రావు ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 84 గ్రాముల బంగారు ఆభరణాలు ఉంచిన బాక్స్ చోరీ జరిగినట్టు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు