జేఎన్‌టీయూకే విభాగాధిపతుల మార్పు

3 Jul, 2014 23:55 IST|Sakshi

భానుగుడి(కాకినాడ) : జేఎన్‌టీయూకేలో వివిధ విభాగాధిపతులను మార్పు చేశారు. బిక్స్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ వి.రవీంద్రను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెల్‌కు డెరైక్టర్‌గా నియమించారు. డాక్టర్ వి.రవీంద్ర వర్సిటీ భౌతిక మౌలిక సదుపాయాలకు సంబంధించి నిర్మాణం, ప్రణాళిక, రూపకల్సన, అభివృధ్ది, విశ్లేషణ, అమలు పర్యవేక్షణ, పరిరక్షణ తదితర అంశాలను పర్యవేక్షించనున్నారు.

జేఎన్‌టీయూకే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుబ్బారావును బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్-బిక్స్‌కు ప్రోగ్రామ్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సీఈ సత్యనారాయణ యూసీఈకే వైస్ ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ కే.బాబులు ఇకపై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా  వ్యవహరిస్తారు.

ఈసీఈ బ్రాంచ్‌కు సంబంధించి విభాగాధిపతిగా ప్రొఫెసర్ ఎ.ఎమ్.ప్రసాద్, ఈఈఈ విభాగాధిపతిగా వి.వి.నరసింహమూర్తి, బిఓఎస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎస్.శివనాగరాజు,  బీఓఎస్ ఎనర్జీ సిస్టమ్స్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎ.రామలింగరాజు,  మెకానికల్ విభాగాధిపతిగా ప్రొఫెసర్ బి.బాలకృష్ణ, పీఈ అండ్ పిసీఈ విభాగాధిపతిగా  ఎన్.వినోద్‌బాబు, మెకానికల్ ఇంజనీరింగ్ బీఓఎస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ వి.వి.సుబ్బారావు, డిజై న్ ఇన్నోవేషన్ సెంటర్  ప్రోగ్రామ్ డెరైక్టర్‌గా డాక్టర్ ఎ.గోపాలకృష్ణ నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు