మీడియాపై ఏపీ సర్కార్ వైఖరి సరికాదు

23 Aug, 2014 02:53 IST|Sakshi

* ఐజేయూ, టీయూడబ్ల్యుజేల హెచ్చరిక
* సాక్షి, నమస్తే తెలంగాణ ప్రతినిధులను అనుమతించకపోవడం అన్యాయం


 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సర్కార్ పత్రిక స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తే సహించబోమని ఇండియన్ జర్నలిస్టు యూనియన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి. మీడియా పట్ల ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ శుక్రవారం ఐజేయూ నేతలు దేవులపల్లి అమర్, కె. శ్రీనివాస్‌రెడ్డి, టీయూడబ్ల్యుజే అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్, విరాసత్ అలీలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎం ప్రెస్‌మీట్‌లకు ‘సాక్షి’ ప్రతినిధులను అనుమతించకపోవడం, అసెంబ్లీ సమావేశాల వార్త సేకరణకు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులకు పాసులు ఇచ్చేందుకు నిరాకరించడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని అన్నారు. చట్టసభలకు మీడియా ప్రతినిధులను అనుమతించే అధికారం స్పీకర్‌కు ఉన్నప్పటికీ దానిని విస్మరించి ప్రభుత్వం ఆంక్షలు విధించడం సహించరానిదని వారు దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు