జర్నలి​స్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలి: పవన్‌

23 Apr, 2020 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరులో తమ వంతు పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. పాత్రికేయులకు అవసరమైన ఆరోగ్య భద్రత, బీమాలు కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరారు. కరోనా విపత్తులోనూ తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు చాలా ధైర్యంగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారని ప్రశంసించారు.

తమిళనాడులో 25 మంది, ముంబైలో 50 మందిపైగా జర్నలిస్టులకు కోవిడ్‌-19 బారిన పడిన నేపథ్యంలో పాత్రికేయులు తమ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. తెలంగాణలోనూ కొన్నిచోట్ల జర్నలిస్టులు కూడా క్వారంటైన్‌కు వెళ్లినట్టు తెలిసిందన్నారు. జర్నలిస్ట్‌ సంఘాలు, మీడియా సంస్థలు.. జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ పవన్‌ కళ్యాణ్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు

మరిన్ని వార్తలు