ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు

3 Jul, 2020 18:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఢిల్లీ తెలుగు జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో వారు మాట్లాడుతూ, తెలుగు జర్నలిస్టులకు కరోనా  పరీక్షలు, చికిత్సకు అవసరమైన  సంపూర్ణ వైద్య ఖర్చులన్నీ  భరిస్తున్న ఏపీ ప్రభుత్వానికి, వైయస్సార్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తమను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. (సీఎం జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన ఖరారు)

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ‘పాత్రికేయులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుంది. తెలుగు జర్నలిస్టులు కరోనా బారిన పడ్డారనే విషయం తెలియగానే  నేను సీఎం జగన్‌తో మాట్లాడా. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా జర్నలిస్టులకు అవసరమైన అన్ని  సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. పార్టీలు, రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ వైద్య సహాయం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. కరోనా చికిత్సకు  అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని రెసిడెంట్‌ కమిషనర్‌ను ఆదేశించారు. మా ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించి రాయాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని తెలిపారు. (సీఎం జగన్‌పై ఎమ్మెల్యేల ప్రశంసలు)

>
మరిన్ని వార్తలు