మోపిదేవి బెయిల్పై తీర్పు వాయిదా

13 Aug, 2013 19:20 IST|Sakshi

హైదరాబాద్: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మధ్యంతర బెయిల్పై నాంపల్లి సిబిఐ కోర్టులోవాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది.

అనారోగ్యంతో బాధపడుతున్నానని వైద్యం కోసం ఆరు నెలలు బెయిల్‌ మంజూరు  చేయాలని కోరుతూ మోపిదేవి సిబిఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  వెన్నెముక సమస్యతో తాను బాధపడుతున్నట్లు మోపిదేవి తన బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు పరీక్షించి ప్రత్యేక వైద్యం చేయించుకోవాలని   సూచించారని తెలిపారు.  విశ్రాంతి తీసుకోవాలని నిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు సూచించినట్లు కోర్టుకు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బెయిల్‌ ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు