జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రంలోనే రిటర్నులు

17 Apr, 2014 02:56 IST|Sakshi

విశాఖపట్నం: అమ్మకపు పన్ను (సేల్స్ ట్యాక్స్) రిటర్నుల దాఖలు జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రం ప్రాతిపదికగానే జరగనున్నట్టు విశ్రాంత అదనపు ముఖ్య కార్యదర్శి, వాణిజ్య పన్నులకు సంబంధించి రాష్ట్రాల పునర్విభజన కమిటీ సలహాదారు అశుతోష్ మిశ్రా స్పష్టం చేశారు. నగరంలోని ఓ హోటల్లో బుధవారం చాంబర్ ఆఫ్ కామర్స్, ఫ్యాప్సీ, డీలర్లతో సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో వ్యాపారస్తులకు ఉత్పన్నమయ్యే సమస్యలపై అవగాహన కల్పించారు. ఇప్పటికే అమల్లో ఉన్న అడ్వాన్స్ రూలింగ్స్ ఉభయ రాష్ట్రాల్లోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.

 ఆన్‌లైన్ దరఖాస్తుకు నెలాఖరు గడువు

 సమావేశంలో తొలుత కొత్త టిన్ నంబర్లు తీసుకునే ందుకు విధివిధానాలు, డీలర్ల హెల్ప్ డెస్క్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు నింపడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీలర్లకు అవగాహన కల్పించారు. హా ఆంధ్రప్రదేశ్/తెలంగాణా/రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ కొత్త టిన్ నంబర్ పొందవచ్చన్నారు. తమ చిరునామా, బ్యాంకు ఖాతా, పాన్ నంబర్ తదితర వివరాల్ని కూడా మార్చుకునే అవకాశం కల్పించారు. ఇందుకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువిచ్చారు.

1. ప్రస్తుతం 11 అంకెల టిన్ నంబర్లో రాష్ట్రాన్ని సూచించే రెండంకెలు 28 కాగా, కొత్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 37, తెలంగాణాకు 36 నెంబర్‌ను కేటాయించారు.
2.ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న డీలర్లకు మే 8 నాటికి టిన్ నెంబర్ జనరేట్ చేస్తారు.
3. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా జూన్ 2 తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు(ఆర్‌సీ) వారు పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా పంపించనున్నారు.
4.ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా జూన్ 1 వరకు ఉమ్మడి రాష్ట్రంలోను, జూన్ 2 నుంచి కొత్త రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. హా కొత్త సి-ఫారాలు కూడా జూన్ 2 తర్వాతే అందిస్తారు. ఇప్పటికే తీసుకున్న పాత ఫారాలుంటే.. వాటిపై కొత్త టిన్ నెంబర్‌ను రబ్బరు స్టాంపు ద్వారా ముద్రించి వినియోగించుకోవచ్చన్నారు.
 
 

మరిన్ని వార్తలు