రక్త సంతకం

2 Dec, 2014 02:05 IST|Sakshi
రక్త సంతకం

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సోమవారం పదో రోజు కూడా విధులను బహిష్కరించారు. క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. క్యాజువాలిటీ ఎదుట నిర్బంధ వైద్య విద్యకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌పై జూడాలు రక్తంతో సంతకాలు చేసి నిరసన తెలిపారు.
          
జూడాల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం
- రక్తంతో సంతకాలు చేసిన వైద్య విద్యార్థులు

కర్నూలు(హాస్పిటల్): సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ చేయించాలని హైకోర్టు తీర్పిచ్చినా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ వైద్యుల హక్కులను కాలరాస్తోందని జూనియర్ వైద్యుల సంఘం నాయకులు నిరంజన్, వంశీ విహారి అన్నారు. సోమవారం స్థానిక కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పదో రోజు కూడా జూడాలు విధులను బహిష్కరించారు. క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. క్యాజువాలిటీ ఎదుట నిర్బంధ వైద్య విద్యకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌పై వైద్యులు రక్తంతో సంతకాలు చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం జూడాలతో చర్చలు చేపట్టకపోవడం దారుణమన్నారు. నిర్బంధ వైద్య విద్య పేరిట జారీ చేసిన జీఓ 107ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జూనియర్ వైద్యుల సంఘం నేతలు ప్రశాంత్, పవన్, విష్ణు, భాను ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు