జూడాల సమ్మె మరింత ఉధృతం

2 Aug, 2013 02:02 IST|Sakshi

లబ్బీపేట, న్యూస్‌లైన్ : తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోరుతూ జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మె మరింత ఉధృతం కానుంది. నాలుగు రోజులుగా అత్యవసర సేవలను సైతం బహిష్కరించి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో శుక్రవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని  జూడాలు నిర్ణయించారు. పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కంపల్సరీ సర్వీసు విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరితో పాటు, ప్రైవేటు మెడికల్ కళాశాలలో పీజీ చేస్తున్న వారి స్టయిఫండ్‌ను మూడేళ్లకు ఒకేసారి డిపాజిట్ చేసేలా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.93 రద్దు వంటి పలు డిమాండ్లతో జూనియర్ వైద్యులు సమ్మె నోటీసు ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోగా, ఎస్మా ప్రయోగిస్తామం టూ బెదిరించింది.
 
 ఆందోళన చేస్తున్న జూడాలను అరెస్ట్ చేయడంతో సమ్మె చేపట్టిన తొలి రోజు మధ్యాహ్నం నుంచే అత్యవసర సేవలను వారు బహిష్కరించారు. ప్రభుత్వాస్పత్రిలో 150 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు, 100 మంది హౌస్‌సర్జన్‌లు విధులు బహిష్కరించడంతో వైద్య సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. అత్యవసర వైద్యం అవసరమైన వారిని మాత్రమే అడ్మిట్ చేస్తున్నారు. ఒకవైపు వైద్యులు, సిబ్బంది లేమితో ఆస్పత్రిలో వైద్యసేవలు అంపశయ్యపై ఉన్న దశలో జూడాలు మెరుపు సమ్మెకు దిగడం గోరుచుట్టుపై రోకలిపోటులా మారిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి జూడాలతో సమ్మె విరమింపజేయకపోవడంతో వారు అందుబాటులో లేక రోగులకు వైద్యం చేయ డం కష్టంగా ఉందని పలువురు వైద్యులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో   రోగులను నిరంతరం పర్యవేక్షి స్తూ చికిత్స అం దించే జూడాల సమ్మె ప్రభావం వైద్య సేవలపై తీవ్రంగా చూపుతోందంటున్నారు.
 
 నామమాత్రంగా ప్రత్యామ్నాయ చర్యలు  
 జూడా సమ్మెతో రోగులు ఇబ్బందులు పడుతున్నా ప్రత్యామ్నాయ చర్యలు అంతంతమాత్రంగానే చేపట్టారు. 250 మంది జూడాలు విధులు బహిష్కరించగా, ఇప్పటివరకూ ప్ర త్యామ్నాయంగా 11 మంది నాన్ క్లినికల్ సర్వీస్ పీజీలతో మాత్రమే ఆస్పత్రిలో విధులు నిర్వహింపజేస్తున్నారు.
 ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు మెరుగైన సేవలు ఎలా అందుతాయని సీనియర్ వైద్యు లే చెబుతున్నారు. శస్త్ర చికిత్సలు చేసే సమయంలో హౌస్ సర్జన్, పీజీలు సహాయకులుగా ఉండేవారని, ప్రస్తుతం వారి సమ్మెతో ఇబ్బం దిగా ఉందని పలువురు సర్జన్లు పేర్కొంటున్నారు. సమ్మె ఎప్పటికి ముగుస్తుందో తెలి యని పరిస్థితి నెలకొనడంతో  ఆస్పత్రిలో రోగులకు ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు