ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ జేకే మహేశ్వరి!

31 Aug, 2019 03:54 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ జె.కె.మహేశ్వరిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసింది.    

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ జె.కె.మహేశ్వరిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసింది. జస్టిస్‌ మహేశ్వరి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ హైకోర్టులో నంబర్‌ టూ స్థానంలో కొనసాగుతున్నారు. వాస్తవానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గతంలో కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం ఆ సిఫారసును వెనక్కి పంపింది.

ఈ నేపథ్యంలో తాజాగా భేటీ అయిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌.వి.రమణలతో కూడిన కొలీజియం.. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ స్థానంలో జస్టిస్‌ జె.కె.మహేశ్వరిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానం చేసిన కొలీజియం తన సిఫారసును కేంద్రానికి పంపింది. 

మరిన్ని వార్తలు