ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి!

7 Sep, 2019 10:07 IST|Sakshi

‘ఏసీజే గ్రీన్‌ సిగ్నల్‌ ∙త్వరలో ఉత్తర్వులు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసు కుంటున్న చర్యల్లో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. లోకాయుక్త నియామకానికి చర్యలు ప్రారం భించింది. రాష్ట్ర లోకాయుక్తగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించాలని నిర్ణయించింది. ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే వెసులు బాటు ప్రభుత్వానికి ఉంది. లోకాయుక్త నియామకం విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిం చాల్సి ఉంటుంది. ఇటీవల లోకాయుక్త నియామక ఫైలును పరిశీలించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌.. లక్ష్మణ్‌రెడ్డి నియామకానికి ఆమోదముద్ర వేశారు. తర్వాత ప్రభుత్వం కూడా ఆయన నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలో ఉత్తర్వులు వెలువ డనున్నాయి.

లోకాయుక్త పరిధి..
ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్య దర్శులపై వచ్చే ఫిర్యాదులను విచారించే పరిధి లోకాయుక్తకు ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్‌ విప్‌లతో పాటు.. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నియమించే ఏ అధికారిపైనైనా కూడా ఫిర్యాదు చేయ వచ్చు. జెడ్పీ, మండల పరిషత్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్లు, సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు సభ్యులు, మునిసిపాలిటీ చైర్‌పర్సన్, ఇతర సభ్యులు తదితరులపై వచ్చే ఫిర్యాదుల న్నింటిపై లోకాయుక్త విచారణ జరపవచ్చు. న్యాయమూర్తులు, జ్యుడీషియల్‌ సర్వీసు సభ్యులు.. లోకాయుక్త పరిధిలోకి రారు. 

రాష్ట్రంలోనే ఏదైనా కోర్టు అధికారి, ఉద్యోగి కూడా లోకాయుక్త పరిధిలోకి రారు. ఏపీ అకౌంటెంట్‌ జనరల్, ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఎన్నికల అధికారులు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఏపీఏటీ చైర్మన్, ఇతర సభ్యులను విచారించే పరిధి లోకాయుక్తకు ఉండదు. అవినీతి, అధికార దుర్వినియోగం తదితరాల విషయంలో ఏ వ్యక్తి అయినా లోకాయుక్తను ఆశ్రయించవచ్చు. ఫిర్యాదుదారు తన పూర్తి వివరాలతో ఫారమ్‌ 1, 2ను పూర్తిచేసి.. లోకాయుక్త రిజిస్ట్రార్‌ పేరిట రూ.150 ఫీజు చెల్లించాలి. తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు తేలితే ఫిర్యాదుదారుని ప్రాసిక్యూషన్‌ చేయవచ్చు. గరిష్టంగా ఏడాది జైలు శిక్ష కూడా విధించవచ్చు. 

మరిన్ని వార్తలు